వైకాపా ప్రభుత్వం ఉద్యోగాలపై ఇచ్చిన బూటకపు ప్రకటనలకు సంబంధించి న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నట్లు ఎమ్మెల్సీ అశోక్ బాబు స్పష్టం చేశారు. కోట్లాది రూపాయల ప్రజా ధనాన్ని ప్రకటనల రూపంలో దుర్వినియోగం చేసిన సీఎం జగన్...నిరుద్యోగులను మోసగించే ప్రయత్నం చేశారని విమర్శించారు. రూపాయి పనికి వంద రూపాయల పని చేశామని చెప్పుకుంటూ పది రూపాయల ప్రచారం చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు.
ప్రభుత్వంపై నిరుద్యోగుల్లో పెరిగిన అసహనం, వ్యతిరేకతను కప్పిపుచ్చుకునేందుకే బూటకపు ప్రచారంతో జాబ్ క్యాలెండర్ ప్రకటించారన్నారు. కొత్తగా ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వకుండా 6లక్షల ఉద్యోగాలిచ్చినట్లు చెప్పుకోవటం పచ్చి మోసమని మండిపడ్డారు. అంగన్వాడీ జీతాలు రూ.7 వేల నుంచి రూ.11 వేలకు పెంచామని దుర్మార్గపు ప్రచారం చేసుకుంటున్నారని ఆక్షేపించారు.
ఇదీచదవండి
Capital Protest: అమరావతి పోరుకు 550 రోజులు..ఏ రోజు ఏం జరిగిందంటే !