ETV Bharat / city

ప్రశాంత రాష్ట్రంలో మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారు: మంత్రి వెల్లంపల్లి - మంత్రి వెల్లంపల్లి తాాజా వార్తలు

అవినీతిలో తెదేపా అధినేత చంద్రబాబు, ఆ పార్టీ నేత జలీల్ ఖాన్​లను మించినవారు లేరని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ విమర్శించారు. చంద్రబాబు, భాజపా నేతలు సోము వీర్రాజు, జీవీఎల్ రాష్ట్రంలో మత విధ్వేషాలు రెచ్చగొడుతున్నారని ఆరోపించారు.

ప్రశాంత రాష్ట్రంలో మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారు

author img

By

Published : Feb 20, 2021, 5:17 PM IST

తెదేపా అధినేత చంద్రబాబు, భాజపా నేతలు సోము వీర్రాజు, జీవీఎల్ రాష్ట్రంలో మత విధ్వేషాలు రెచ్చగొడుతున్నారని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ విమర్శించారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం భవానీపురంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన... ప్రశాంత రాష్ట్రంలో మత విద్వేషాలు రెచ్చగొట్టడం సరికాదన్నారు. అవినీతిలో చంద్రబాబు, ఆ పార్టీ నేత జలీల్ ఖాన్​లను మించినవారు లేరని విమర్శించారు. ఎమ్మెల్యేగా ఉన్న స‌మ‌యంలో జలీల్ ఖాన్ వక్ఫ్ బోర్డు ద్వారా కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారన్నారు. చంద్రగిరి, కుప్పంలో ప్రజలు చంద్రబాబును ఛీకొట్టారని వెల్లంపల్లి ఎద్దేవా చేశారు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా స్థానికుల సమస్యలను తెలుసుకున్న మంత్రి... ఎంపీ కేశినేని ఏనాడు ప్రజా సమస్యలపై స్పందించలేదన్నారు. సీఎం జగన్ అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలతో రాష్ట్ర ప్రజలు ఆనందంగా ఉన్నారన్నారు. జనసేన అధినేత పవన్​కు అప్పుడప్పుడు మాత్రమే రాజకీయం గుర్తొస్తుందని ఎద్దేవా చేశారు. పంచాయతీ ఎన్నికల ఫలితాలపై ఆపార్టీ తప్పుడు లెక్కలు ప్రచారం చేస్తుందన్నారు.

ఇదీచదవండి

ఏపీకి రూ.2,222.71 కోట్ల జీఎస్టీ పరిహారం విడుదల

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.