ETV Bharat / city

'సీఐడీ అదనపు డీజీ'పై నివేదిక ఇవ్వండి: రఘురామ ఫిర్యాదుపై కేంద్ర హోంశాఖ - సీఐడీ అదనపు డీజీ ఫిర్యాదుపై స్పందించిన కేంద్రం హోంశాఖ వార్తలు

ministry-of-home-affairs-respond-on-mp-raghurama-letter

author img

By

Published : Jul 3, 2021, 3:21 PM IST

Updated : Jul 3, 2021, 7:46 PM IST

15:18 July 03

ఏపీ సీఎస్​కు ఆదేశం

ఏపీ సీఐడీ అదనపు డైరెక్టర్‌ జనరల్‌ పీవీ సునీల్‌కుమార్‌పై నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు చేసిన ఫిర్యాదులపై కేంద్ర హోం శాఖ స్పందించింది. జూన్‌ 5, 8, 10 తేదీల్లో ఐపీఎస్‌ అధికారి పీవీ సునీల్‌ కుమార్‌కు వ్యతిరేకంగా రఘురామకృష్ణరాజు చేసిన మూడు ఫిర్యాదులపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పింది. అందుకు సంబంధించి తీసుకున్న చర్యలపై నివేదికను సాధ్యమైనంత త్వరగా తమకు సమర్పించాలని.. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఉత్తర్వులు జారీ చేసింది. ఆదేశాలతోపాటుగా... తమకు వచ్చిన ఫిర్యాదులు, వాటితోపాటు జత చేసిన సీడీలనూ కేంద్ర హోం శాఖ రాష్ట్ర సీఎస్​కు పంపింది.

సీఐడీ ఏడీజీగా ఉన్న సునీల్ కుమార్.. ఐపీఎస్‌ సర్వీసు నిబంధనలను ఉల్లంఘించారని రఘురామకృష్ణ రాజు హోం శాఖకు ఫిర్యాదు చేశారు. రిజర్వేషన్‌ల ఆధారంగా ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరి ఆ తర్వాత మతం మారిన వారిని సర్వీసుల నుంచి తొలగించాలని ఇటీవల మద్రాస్‌ హైకోర్టు ఇచ్చిన రూలింగ్‌ను దృష్టిలో ఉంచుకొని క్రిస్టియన్‌గా మారిన పీవీ సునీల్‌ కుమార్‌ను ఉద్యోగం నుంచి తొలగించాలని కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్‌భల్లాను రఘురామ కోరారు. ఈ మేరకు సునీల్‌ కుమార్‌పై 5 పేజీల ఫిర్యాదును, ఆయన వివిధ మతపరమైన కార్యక్రమాల్లో చేసిన ప్రసంగాలకు సంబంధించిన సీడీలను కేంద్ర హోం శాఖ కార్యదర్శికి నర్సాపురం ఎంపీ పంపారు. వీటిపై స్పందించిన కేంద్ర హోం శాఖ.. సీఎస్ కు ఉత్తర్వులను జారీ చేసింది.

కేంద్ర హోం శాఖ కార్యదర్శికి రాసిన లేఖలో రఘురామ ప్రస్తావించిన అంశాలు..

తన అధికార హోదాను అడ్డుపెట్టుకొని వ్యక్తిగత కార్యకలాపాలు నిర్వహిస్తూ అంబేడ్కర్స్‌ ఇండియా మిషన్‌ పేరుతో ఒక ప్రైవేటు సంస్థను ఏర్పాటు చేశారు. దాని ద్వారా తనను తానే సెలెబ్రిటీగా ప్రమోట్‌ చేసుకోవడం పోలీస్‌ ఫోర్సెస్‌(రెస్ట్రిక్షన్‌ ఆఫ్‌ రైట్స్‌) యాక్ట్‌ 1966లోని సెక్షన్‌ 3కి విరుద్ధం.

  • షెడ్యూల్డ్‌ కులాల ప్రజలను రెచ్చగొడుతున్నారు. హిందూ మతం, హిందూ దేవతలు, పవిత్రమైన హిందూ గ్రంథాలకు వ్యతిరేకంగా సామాజిక మాధ్యమాల ద్వారా విద్వేషపూరిత అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
  • బహిరంగంగా రాజకీయ భావజాలాన్ని విమర్శిస్తూ ప్రజల్లో రాజకీయ అభిప్రాయాలు సృష్టిస్తున్నారు.
  • హిందూ మతంపై డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ వ్యక్తం చేసిన అభిప్రాయాలను వక్రీకరిస్తూ ఆయన్ను హిందూ వ్యతిరేకిగా చిత్రీకరిస్తున్నారు.
  • షెడ్యూల్డ్‌ కులాల్లో వేర్పాటు వాద భావజాలాన్ని ప్రోత్సహిస్తున్నారు.
  • సమాజంలో కులాధారిత విభజనను సృష్టిస్తున్నారు.
  • రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ లాంటి జాతీయవాద సంస్థల మీద ఆరోపణలు చేస్తూ అలాంటి వాటిపట్ల ఒక ప్రత్యేక గ్రూప్‌లో నెగెటివ్‌ ముద్ర సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారు.

పై ఆరోపణలతోపాటు పీవీ సునీల్ కుమార్ చేసిన ప్రసంగాలకు సంబంధించిన మీడియా లింకులను రఘురామ జత చేశారు.

సీఐడీ కస్టడీలో ఉన్నప్పుడు తన ఫోన్‌ను అనధికారికంగా స్వాధీనం చేసుకుని దాని ద్వారా మాజీ ఐఏఎస్‌ అధికారి పీవీ రమేష్, ఆయన కుటుంబ సభ్యులకు వాట్సప్‌ సందేశాలు పంపడంపై దర్యాప్తు జరపాలని దిల్లీ పార్లమెంటు పోలీస్‌స్టేషన్‌ డిప్యూటీ కమిషనర్‌కు రఘురామ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఫిర్యాదును కేంద్ర హోం శాఖ కార్యదర్శికి పంపి చర్యలు తీసుకోవాలని కూడా రఘురామ కోరారు.

ఈ అంశాలపై కేంద్ర హోం శాఖ స్పందించింది. ఏపీ ప్రభుత్వం తగు నిర్ణయం తీసుకొని, అందుకు సంబంధించిన చర్యా నివేదికను సమర్పించాలని ఆదేశించింది. హోం శాఖలోని పోలీసు-I విభాగం అండర్ సెక్రటరీ సంజీవ్ కుమార్.. ఈ మేరకు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ పంపారు.

ఇదీ చదవండి:

AMARAVATI: ఎమ్మెల్యే శ్రీదేవికి నిరసన సెగ.. రాజీనామా చేయాలని రైతుల డిమాండ్

Last Updated : Jul 3, 2021, 7:46 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.