Ministers reacts on repalle rape: బాపట్ల జిల్లా రేపల్లెలో మహిళపై అత్యాచారం అత్యంత బాధాకరమని.. మంత్రి రజని అన్నారు. ఘటనపై.. సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారని తెలిపారు. నిందితులకు కఠిన శిక్ష పడేవరకు ప్రభుత్వం వదిలిపెట్టదన్న మంత్రి.. ఇప్పటికే ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. బాధితురాలికి మెరుగైన వైద్యం అందేలా ఆదేశించినట్లు పేర్కొన్నారు. ఘనటపై జిల్లా ఎస్పీ, ఆస్పత్రి అధికారులతో మాట్లాడినట్లు తెలిపారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని మంత్రి రజని స్పష్టం చేశారు.
అత్యాచార ఘటన బాధాకరం.. రేపల్లె రైల్వేస్టేషన్‌లో మహిళపై అత్యాచార ఘటన బాధాకరమని.. మంత్రి మేరుగు నాగార్జున అన్నారు. రేపల్లె రైల్వేస్టేషన్‌కు వచ్చిన మంత్రి.. అత్యాచార ఘటనకు సంబంధించిన వివరాలు.. పోలీసులను అడిగి తెలుసుకున్నారు. ఘటన జరిగిన 5 నిమిషాల్లోనే పోలీసులు స్పందించారని తెలిపారు. బాధితులకు ప్రభుత్వం రూ.2 లక్షలు ఆర్థిక సాయం చేసిందన్నారు. నిందితులను వదిలేది లేదని స్పష్టం చేసిన మంత్రి.. బాధితురాలికి అండగా ఉంటామని పేర్కొన్నారు.
నిందితులను శిక్షించాలి.. రేపల్లెలో జరిగిన అత్యాచార ఘటనపై మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ స్పందించారు. అత్యాచారానికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. రైల్వేస్టేషన్‌లో మహిళల భద్రతకు సంబంధించిన పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని ఆ శాఖ అధికారులను ఆదేశించారు. బాధితురాలిని అన్ని విధాలా ఆదుకుంటామని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: