ETV Bharat / city

'ఎస్‌ఈసీ చర్యలు కుట్రపూరితం.. కోడ్ ముగిశాక అన్నీ సరి చేస్తాం' - ఎస్​ఈసీపై మంత్రి పెద్దిరెడ్డి కామెంట్స్

‘రాష్ట్ర ఎన్నికల కమిషనరు ఓ పార్టీ తరఫున కుట్రదారుగా పని చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా ఎన్నికల కోడ్‌ ముగిశాక అన్నింటినీ సరి చేస్తాం. ఏ అధికారికీ అన్యాయం జరగనివ్వబోం. వారి విశ్వసనీయతను, ఆత్మస్థైర్యాన్ని కాపాడతాం’ అని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖల మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. తమ శాఖ ముఖ్య కార్యదర్శి, కమిషనర్లు ఏం తప్పు చేశారని వారిపై చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు. పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి బొత్స సత్యనారాయణతో కలిసి మంగళవారం విజయవాడలో ఆయన విలేకరులతో మాట్లాడారు.

పంచాయతీల ఏకగ్రీవంపై ఎస్​ఈసీకి దురుద్దేశాలు

author img

By

Published : Jan 26, 2021, 9:38 PM IST

Updated : Jan 27, 2021, 6:50 AM IST

ఎన్నికల కోడ్‌ ముగిశాక ఆయన నిర్ణయాలను సరిచేస్తాం
ఏం తప్పు చేశారని పంచాయతీరాజ్‌ ముఖ్య కార్యదర్శి, కమిషనర్‌పై చర్యలు తీసుకున్నారు?
ప్రశ్నించిన మంత్రి పెద్దిరెడ్డి
ఏకగ్రీవం కావాలనేదే మా ఉద్దేశం: సజ్జల

‘రాష్ట్ర ఎన్నికల కమిషనరు ఓ పార్టీ తరఫున కుట్రదారుగా పని చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా ఎన్నికల కోడ్‌ ముగిశాక అన్నింటినీ సరి చేస్తాం. ఏ అధికారికీ అన్యాయం జరగనివ్వబోం. వారి విశ్వసనీయతను, ఆత్మస్థైర్యాన్ని కాపాడతాం’ అని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖల మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. తమ శాఖ ముఖ్య కార్యదర్శి, కమిషనర్లు ఏం తప్పు చేశారని వారిపై చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు. పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి బొత్స సత్యనారాయణతో కలిసి మంగళవారం విజయవాడలో ఆయన విలేకరులతో మాట్లాడారు. సదాలోచనలతోనే ఎస్‌ఈసీ తన విచక్షణాధికారాలను వినియోగిస్తే బాగుంటుందన్నారు. ఇష్టమొచ్చినట్లు ఆదేశాలనిచ్చి అధికారులను, ప్రజలను భయభ్రాంతులను చేయాలనుకోవడాన్ని ఆయన విచక్షణకే వదిలేస్తున్నామని పేర్కొన్నారు. ఏకగ్రీవాలయ్యే పంచాయతీలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని ఆయన వ్యాఖ్యానించారని, ఆయనతో కొన్ని శక్తులు అలా మాట్లాడిస్తున్నాయని పెద్దిరెడ్డి చెప్పారు. ఏకగ్రీవ పంచాయతీలకు ప్రోత్సాహకాలను లోగడ పెంచినప్పుడు చాలా బాగున్నాయని ఇదే ఎస్‌ఈసీ అన్నారని వివరించారు.

అలా అంటే తప్పే: మంత్రి బొత్స
ఏకగ్రీవమయ్యే పంచాయతీలపై దృష్టి పెట్టేందుకు ప్రత్యేకాధికారిని నియమిస్తున్నామని రాష్ట్ర ఎన్నికల కమిషనరు వ్యాఖ్యానించి ఉంటారని తాననుకోవడం లేదని, ఆయన అలా అనుంటే అది కచ్చితంగా తప్పేనని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. ఏకగ్రీవ పంచాయతీలకు నగదు ప్రోత్సాహకాలనివ్వడం 2001 నుంచే ప్రారంభమైందని గుర్తుచేశారు.

కక్షలు లేకుండా ఏకగ్రీవాలే ప్రభుత్వ యోచన

పంచాయతీల ఏకగ్రీవంపై ఎస్​ఈసీకి దురుద్దేశాలు
పంచాయతీ ఎన్నికల్ని పార్టీలకతీతంగా నిర్వహిస్తున్నందున ఈ స్ఫూర్తితో ఏకగ్రీవాలు చేసుకోవాలని మంత్రులు పెద్దిరెడ్డి, బొత్స పిలుపునిచ్చారు. ఈ ఎన్నికల వల్ల గ్రామాల్లో రాజకీయ కల్మషం చొరబడకుండా.. కక్షలు, కార్పణ్యాలకు తావు లేకుండా ఏకగ్రీవాలు కావాలని ప్రభుత్వం కోరుకుంటోందని వివరించారు. ఏకగ్రీవ పంచాయతీలకు ప్రోత్సాహకంగా ప్రభుత్వమిచ్చే నిధులకు మ్యాచింగ్‌ గ్రాంట్‌ జతచేసి ఉపాధి హామీతోపాటు పలు పథకాల ద్వారా 90శాతం ఎక్కువ నిధులు తెచ్చుకునే అవకాశముందని వివరించారు. గ్రామాల్లో వర్గాలను ప్రోత్సహించాలని, కులాలవారీగా విభజించాలని తెదేపా ప్రయత్నిస్తోందని ఆరోపించారు.

ఏకగ్రీవాలకు సహకరించండి: సజ్జల

పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలకు అన్ని పార్టీలు, మేధావులు, గ్రామాల పెద్దలు సహకరించాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కోరారు. ‘పార్టీల గుర్తులేమీ లేకుండా జరిగే ఎన్నికలు కాబట్టి వీటిలో పార్టీల బలాబలాలను చూసుకునే పరిస్థితి ఉండదు. బలాబలాలను పార్టీల గుర్తులపై జరిగే జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో చూసుకుందాం’ అని పేర్కొన్నారు. వైకాపా కేంద్ర కార్యాలయంలో గణతంత్ర దినోత్సవంలో, సాయంత్రం విలేకరులతో ఆయన మాట్లాడారు. ‘అధికారంలో ఉన్న ఏ పార్టీ అయినా సహజంగా లభించే అవకాశాలు, వెసులుబాటును వదులుకోదు. కానీ, పంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో ఏకగ్రీవాలు కావాలనే ఉద్దేశంతో మేం చేతులు కట్టేసుకుని బరిలోకి దిగుతున్నాం. ఏకగ్రీవాలపై చూపు చూస్తామని ఎస్‌ఈసీ పేర్కొనడం వెనక వేరే ఉద్దేశాలున్నాయి. ఆయన వెనకున్న ప్రధాన ప్రతిపక్షం (తెదేపా) పల్లెల్లో వర్గాలను రెచ్చగొట్టి కక్షలను పెంచాలని చూస్తోందన్న అనుమానం కలుగుతోంది. ఎన్నికల్లో నీతిమాలిన చర్యలకు పాల్పడినా, ఓటర్లను ప్రలోభపర్చినా తప్పు చేసేవారు భయపడేలా పంచాయతీరాజ్‌ చట్టంలో కొత్తగా చేసిన మార్పుల ప్రకారం కఠిన చర్యలుంటాయి. గెలిచినప్పటికీ అనర్హత వేటు పడుతుంది. ఆరేళ్లపాటు మళ్లీ పోటీ చేసే అవకాశం ఉండదు. రెండేళ్లపాటు జైలు శిక్ష విధిస్తారు. పైన వారేదో చెప్పారని చేసేసి భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని అభ్యర్థులకు విన్నవిస్తున్నాం. మేరుపర్వతం లాంటి వైకాపాను వెంటిలేటరుపై ఉన్న తెదేపా ఢీకొనలేదు. కానీ డబ్బుతోనే.. మరో రకంగానో ఎన్నికల్లో గొడవ సృష్టించేందుకు ఆ పార్టీ ప్రయత్నిస్తుంది. కావాలనే పంచాయతీ ఎన్నికలను ముందుకు తెచ్చిన ఎస్‌ఈసీ ఇబ్బందిపెడితే పెట్టొచ్చు కానీ.. ఎన్నికలు నిష్పాక్షికంగా జరగాలనేదే వైకాపా ఉద్దేశం. ఎస్‌ఈసీ వైపునుంచి కూడా ఇదే ఆశిస్తున్నాం’ అని సజ్జల పేర్కొన్నారు.

ఇదీచదవండి: ఆ ఇద్దరూ విధి నిర్వహణలో ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం వహించారు: ఎస్ఈసీ

Last Updated : Jan 27, 2021, 6:50 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.