ఒకవైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధి అనే నినాదంతో.. విజయవాడ అభివృద్ధి పథంలో దూసుకెళ్తోందని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు. నగరంలోని భవానీపురం, శంకరమఠం వీధిలో రూ.75 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించనున్న సీసీ రోడ్ల నిర్మాణానికి శంఖుస్థాపన చేశారు.
శాశ్వత ప్రాతిపదికన డ్రైనేజీ అభివృద్ధి పనులకు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులను తెదేపా హయాంలో దారి మళ్లించారని ఆరోపించారు. కానీ వైకాపా ప్రభుత్వం ఆ నిధులను సక్రమంగా వినియోగిస్తోందని పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో నిలిచిపోయిన అన్ని రకాల అభివృద్ధి పనులు శరవేగంగా జరిగేలా ప్రత్యేక దృష్టి సారించామని మంత్రి చెప్పారు. శంకుస్థాపన కార్యక్రమంలో నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, మున్సిపల్ కమిషనర్ ప్రసన్న వెంకటేశ్, స్థానిక కార్పొరేటర్లు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: కరోనా విస్తరిస్తుంటే.. పరీక్షల నిర్వహణ సరికాదు: నారా లోకేశ్