తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి రథం దగ్ధంపై దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ విచారణకు ఆదేశించారు. విచారణ అధికారిగా దేవదాయ శాఖ అదనపు కమిషనర్ రామచంద్రమోహన్‌ను నియమించారు. ఘటనపై దిగ్బ్రాంతి వ్యక్తం చేసిన మంత్రి.... దేవాదాయ కమిషనర్ పి.అర్జునరావు, జిల్లా ఎస్సీతో మంత్రి ఫోన్ మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. దేవాదాయ, పోలీస్, ఫైర్, రెవెన్యూ అధికారులతో చేపడుతున్న సహయక చర్యలపై ఆరా తీశారు. ఈ ఘటనపై కఠిన చర్యలు చేపట్టాలని, దేవాదాయ శాఖ అధికారులతో పాటు పోలీసులను ఆదేశించారు. రథం పున నిర్మాణానికి చర్యలు చేపట్టాలని దేవాదాయ కమిషనర్‌కు మంత్రి ఆదేశించారు.
ఇదీ చదవండి: అంతర్వేది ఘటనపై విచారణ జరపాలని భక్తుల డిమాండ్