దసరా మహోత్సవాల ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ దేశంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అమ్మవారి దర్శనం త్వరితగతిన కలిగే విధంగా అన్ని శాఖల సమన్వయంతో చర్యలు చేపడుతున్నట్లు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు తెలిపారు. సుమారు 15 లక్షల మంది అమ్మవారి దర్శనం చేసుకునేలా సదుపాయాలు కల్పిస్తున్నట్లు వెల్లడించారు. మూలా నక్షత్రం రోజున రాష్ట్ర ప్రభుత్వము తరఫున ముఖ్యమంత్రి జగన్ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నట్లు పేర్కొన్నారు.
ఇదీ చదవండి: వైభవంగా శ్రీపద్మావతి అమ్మవారి పవిత్రోత్సవాలు