Minister Taneti Vanitha: ప్రజలకు హానికలిగించే పరిశ్రమలను ప్రభుత్వం ప్రోత్సహించదని రాష్ట్ర హోంమంత్రి తానేటి వనిత స్పష్టం చేశారు. ఏలూరు జిల్లా ముసునూరు మండలం అక్కిరెడ్డి గూడెంలో జరిగిన ఘటనపై సీఎం జగన్ స్పందించి, పరిశ్రమను సీజ్ చేయటానికి ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు. ఈ ఘటనలో గాయపడి విజయవాడ గొల్లపూడిలో ఉన్న ఆంధ్ర ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న.. క్షతగాత్రులను వనిత పరామర్శించారు.
మెుత్తం 11 మందిలో 4 నలుగురికి 50 శాతం కన్నా తక్కువ గాయాలుకాగా.. మరో ఆరుగురికి 50 శాతం కన్నా అధికంగా గాయాలైనట్లు పేర్కొన్నారు. ఒకరికి మాత్రం 90 శాతానికిపైగా శరీరం కాలిపోయినట్లు వెల్లడించారు. చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు రూ.25 లక్షలు ప్రభుత్వం నుంచి.. పరిశ్రమ నుంచి మరో రూ.25 లక్షలు అందిస్తున్నట్లు వివరించారు. గాయపడిన వారికి రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించినట్లు హోంమంత్రి తెలిపారు. పరిశ్రమ నుంచి లీకేజీల వల్ల అక్కడి ప్రజలకు సమస్య ఉన్నట్లు బాధితులు మాట్లాడుతున్నారన్న వనిత.. పరిశ్రమ అక్కడ ఉండకూడదని ప్రజలు చెబుతున్నారని తెలిపారు.
సంబంధిత కథనాలు: