ETV Bharat / city

Minister Roja: పర్యాటక రంగానికి నేనే అంబాసిడర్‌: మంత్రి రోజా - రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, క్రీడా శాఖల మంత్రి రోజా

Minister Roja: దేశ, విదేశాల నుంచి రాష్ట్రానికి పెద్దఎత్తున పర్యాటకులు తరలి వచ్చేలా అవసరమైన చర్యలు చేపడతామని.. రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, క్రీడా శాఖల మంత్రి రోజా తెలిపారు. రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలకు దేశ, విదేశాల్లో మంచి ప్రాచుర్యం కల్పించేందుకు ప్రత్యేక అంబాసిడర్‌గా పని చేస్తానని అన్నారు.

Minister Roja held review meeting with sports, tourism and cultural department personnels
పర్యాటక రంగానికి నేనే అంబాసిడర్‌: మంత్రి రోజా
author img

By

Published : Apr 28, 2022, 9:16 AM IST

Minister Roja: రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలకు దేశ, విదేశాల్లో మంచి ప్రాచుర్యం కల్పించేందుకు ప్రత్యేక అంబాసిడర్‌గా పని చేస్తానని.. రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, క్రీడా శాఖల మంత్రి రోజా తెలిపారు. సచివాలయంలో బుధవారం ఆమె ఆయా శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. దేశ, విదేశాల నుంచి రాష్ట్రానికి పెద్దఎత్తున పర్యాటకులు తరలి వచ్చేలా అవసరమైన వాయు, రోడ్డు, రైలు రవాణా సౌకర్యాలు కల్పించే విషయంలో అధికారులు దృష్టి సారించాలని ఆదేశించారు.

కళాకారులందరికీ గుర్తింపు కార్డులు జారీ చేసేలా కలెక్టర్లకు మార్గదర్శకాలు పంపాలని.. అధికారులకు మంత్రి సూచించారు. ప్రభుత్వ, ప్రైవేట్‌ భాగస్వామ్యంతో క్రీడా ప్రాంగణాల అభివృద్ధికి చేపట్టిన పనులను వేగవంతం చేయాలని అన్నారు.

ఇదీ చదవండి:

అప్పులపై రాష్ట్రం పంపిన నివేదికను.. వెనక్కి పంపిన కేంద్రం.. ఎందుకంటే..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.