ETV Bharat / city

వైద్యారోగ్యశాఖలో చిన్న తప్పు జరిగినా ఉపేక్షించేది లేదు: మంత్రి రజని - విడుదల రజని న్యూస్

వైద్యారోగ్యశాఖలో చిన్న తప్పు జరిగినా ఉపేక్షించేది లేదని వైద్యారోగ్యశాఖ మంత్రి విడదల రజని అన్నారు. ఇటీవల చోటు చేసుకున్న ఘటనల కారణంగా కాస్త కఠినంగానే వ్యవహరించాల్సి వచ్చిందన్నారు. గ్రామస్థాయి వరకూ అత్యుత్తమ వైద్య సేవలు అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు.

వైద్యారోగ్యశాఖలో చిన్న తప్పు జరిగినా ఉపేక్షించేది లేదు

author img

By

Published : May 9, 2022, 10:43 PM IST

గ్రామస్థాయి వరకూ అత్యుత్తమ వైద్య సేవలు అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని వైద్యారోగ్యశాఖ మంత్రి విడదల రజని స్పష్టం చేశారు. వైద్యారోగ్యశాఖకు రాష్ట్ర ప్రభుత్వం 16 వేల కోట్ల బడ్జెట్​ను కేటాయించిందని చెప్పారు. అందుకు అనుగుణంగానే సేవలు అందించాల్సి ఉందని మంత్రి వ్యాఖ్యానించారు. వైద్యారోగ్యశాఖపై అధికారులతో కలిసి మంత్రి సమీక్ష నిర్వహించారు. ఆస్పత్రుల్లో మందులు, అంబులెన్సుల కొరతపై మీడియాలో కథనాలు వచ్చాయని.., చిన్న చిన్న ఘటనలు కూడా రోగులపై తీవ్రప్రభావం చూపుతున్నాయని చెప్పారు.

వైద్యారోగ్యశాఖలో ఒక్కరు తప్పు చేసినా.. రోగుల ప్రాణాలకు ముప్పు వాటిల్లినట్టేనని వ్యాఖ్యనించారు. త్వరలోనే అన్ని జిల్లాల్లోని ఆస్పత్రులనూ తనిఖీ చేస్తానని మంత్రి వెల్లడించారు. ఈ మేరకు జిల్లాల డీఎంహెచ్​వోలు, వైద్యాధికారులతో మంత్రి వీడియో కాన్ఫరెన్సు ద్వారా మాట్లాడారు. కొవిడ్ మహమ్మారిని అడ్డుకోవటంలో వైద్యారోగ్యశాఖ సమర్ధంగా పనిచేసిందని.. ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని ఆమె సూచించారు. ఇటీవల చోటు చేసుకున్న ఘటనల కారణంగా కాస్త కఠినంగానే వ్యవహరించాల్సి వచ్చిందని మంత్రి రజని స్పష్టం చేశారు. వైద్యారోగ్యశాఖలో చిన్న తప్పు జరిగినా ఉపేక్షించేది లేదని అన్నారు.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.