'స్థానికంగా ఉండే యువతకు ఇక్కడే సాఫ్ట్వేర్ ఉద్యోగాలు లభించటం నా కల.. అది ఇప్పుడు నెరవేరింది' అని తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి అజయ్‌కుమార్ అన్నారు. ఇటీవల నూతనంగా ప్రారంభించిన ఖమ్మం ఐటీ హబ్‌లో ఉద్యోగాలకు ఎంపికైన యువతకు ఆయన నియామక పత్రాలు అందచేశారు. కలెక్టర్ కర్ణన్‌తో కలిసి యువతతో ముచ్చటించారు.
టైర్ 2సిటీల్లో ఐటీ ఉద్యోగాలు లభించే విధంగా కేటీఆర్, కేసీఆర్ ఆలోచనలకు ఇక్కడ కార్యరూపం దాల్చిందన్నారు. ఖమ్మంలో పుట్టి విదేశాల్లో ఐటీ కంపెనీలు స్థాపించిన బిడ్డలు తిరిగి ఇక్కడి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించటం పట్ల మంత్రి సంతోషం వ్యక్తం చేశారు. కంపెనీలకు మంచి పేరు తీసుకురావాలని ఇక్కడ పనిచేసే యువతకు విజ్ఞప్తి చేశారు.