వైఎస్ఆర్ చేయూత కింద ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం పొందిన వారికి స్వయం ఉపాధి కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి తెలిపారు. మంత్రులు బొత్స, కన్నబాబు, సీదరి అప్పలరాజుతో కలిసి బ్యాంకర్లు, పలు సంస్థల అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా 21 లక్షలకుపైగా మహిళలు స్వయం ఉపాధి కోసం దరఖాస్తు చేసుకున్నారని మంత్రి పెద్దరెడ్డి వెల్లడించారు.
వీరిలో ఇప్పటి వరకు 11,270 మంది కొత్తగా రిటైల్ దుకాణాలను ఏర్పాటు చేసుకుని వ్యాపారాలు ప్రారంభించినట్లు తెలిపారు. పెండింగ్లో ఉన్న వారికి స్వయం ఉపాధి కల్పన అందించే అంశాలపై సమగ్రంగా చర్చించారు. దరఖాస్తు చేసుకున్న మహిళలందరికీ ఉపాధి కల్పించేలా సంస్థలు ,బ్యాంకర్లు...సహకారం, రుణాలు అందించాలని కోరారు. మహిళలకు సాధికారత కల్పించటమే తమ ప్రభుత్వ లక్ష్యమని పెద్దిరెడ్డి స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: