ETV Bharat / city

Peddireddy on 3 capitals repeal bill: చట్టం ఉపసంహరణ ఇంటర్వెల్‌ మాత్రమే: మంత్రి పెద్దిరెడ్డి - మూడు రాజధానుల చట్టం ఉపసంహరణపై వైకాపా మంత్రుల కామెంట్స్

minister peddi reddy on ap 3 capitals repeal bill
మూడు రాజధానుల ఉపసంహరణపై మంత్రి పెద్దిరెడ్డి స్పందన
author img

By

Published : Nov 22, 2021, 1:00 PM IST

Updated : Nov 22, 2021, 2:46 PM IST

12:56 November 22

మూడు రాజధానుల చట్టం ఉపసంహరణపై వైకాపా మంత్రుల కామెంట్స్..

చట్టం ఉపసంహరణ ఇంటర్వెల్‌ మాత్రమే: మంత్రి పెద్దిరెడ్డి

ఏపీ మూడు రాజధానుల చట్టం ఉపసంహరణపై మంత్రి పెద్దిరెడ్డి(minister peddireddy on ap 3 capitals law withdraw) స్పందించారు. చట్టం ఉపసంహరణ ఇంటర్వెల్‌ మాత్రమే.. శుభం కార్డుకు మరింత సమయం ఉందని పెద్దిరెడ్డి వ్యాఖ్యానించారు. సాంకేతిక సమస్యలు సరిదిద్దేందుకే హైకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేశామని.. చట్టం ఉపసంహరణ అమరావతి రైతుల విజయమేమీ(AP ministers on repeals of ap 3 capitals act) కాదన్నారు. నేను ఇప్పటికీ మూడు రాజధానులకే కట్టుబడి ఉన్నా అని మంత్రి ఉద్ఘాటించారు. ఈ మేరకు చిత్తూరు జిల్లా రాయలచెరువులో మీడియాతో మంత్రి మాట్లాడారు.అమరావతి రైతుల పాదయాత్ర.. పెయిడ్‌ ఆర్టిస్టుల పాదయాత్రగా అభివర్ణించిన మంత్రి పెద్దిరెడ్డి(minister peddireddy latest news on amaravathi padayatra).. రైతుల పాదయాత్ర లక్షలమందితో సాగుతోందా అని ఎద్దేవా చేశారు. 

మూడు రాజధానుల ఉపసంహరణ విషయం నాకు తెలియదని.. అలాంటి ఏదైనా ఉంటే సీఎం జగన్ అసెంబ్లీలో ప్రవేశపెడతారని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి.. ఒంగోలులో పేర్కొన్నారు.

ఇదీ చదవండి.. 

AP cabinet News: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. మూడు రాజధానుల చట్టం ఉపసంహరణ

 AP repeals 3 Capitals Act: అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించే వరకు ఉద్యమం ఆగదు: అమరావతి ఐకాస

Last Updated : Nov 22, 2021, 2:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.