Peddireddy On Pensions: వైఎస్సార్ పింఛన్ కానుక పథకం కింద జనవరి నుంచి సామాజిక పెన్షన్ లబ్ధిదారులకు రూ. 2500 పంపిణీ చేయనున్నట్లు పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. పెన్షన్ను రూ.2,250 నుంచి రూ. 2,500లకు పెంచుతూ.. ఇప్పటికే ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేశామన్నారు. 5 రోజుల పాటు పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించనున్నట్లు మంత్రి పెద్దిరెడ్డి వెల్లడించారు.
జనవరి 1న గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో ఈ కార్యక్రమాన్ని సీఎం జగన్ లాంఛనంగా ప్రారంభిస్తారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 61.75 లక్షల మంది లబ్ధిదారులకు పెన్షన్ పంపిణీ జరుగుతుందన్నారు. ఇందుకోసం ప్రభుత్వం రూ. 1,570.60 కోట్లు విడుదల చేసిందన్నారు. జనవరిలో కొత్తగా 1.41 లక్షల మందికి పెన్షన్లు మంజూరు చేశామని మంత్రి వివరించారు.
తొలుత పెదనందిపాడులో సీఎం జగన్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని ప్రభుత్వ ఉన్నతాధికారులు ప్రకటించగా.. చివరి నిమిషంలో ప్రత్తిపాడుకు వేదికను మార్పు చేశారు.
ఇదీ చదవండి
Pensions: జనవరి 1 నుంచి అమల్లోకి పెంచిన పెన్షన్.. ప్రారంభించనున్న సీఎం జగన్