రైతులకు గిట్టుబాటు ధర కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి మోపిదేవి వెంకటరమణ అన్నారు. ఎప్పుడైనా గిట్టుబాటు ధర రాకుంటే ప్రభుత్వం ఆదుకుంటుందని తెలిపారు. రైతులను ఆదుకునేందుకు రూ. 3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసిందన్నారు. 35 వేల మంది శనగ రైతులకు 70 కోట్ల మేర పరిహారం చెల్లించామనీ.. 7 జిల్లాల్లో 330 కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
క్రాప్ బుకింగ్ చేసుకున్న వారికి ఆర్ధిక సాయం వస్తుందనీ.. శనగ రైతులు అలా చేసుకోకపోవడం వల్లే ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. ఇ-క్రాప్ నిబంధనలు సడలించి వారినైనా ఆదుకోవాలని సీఎం ఆదేశించారని తెలిపారు. ఉల్లి ధరలు తగ్గించేందుకు మహారాష్ట్ర, ఇతర ప్రాంతాల నుంచి 700 మెట్రిక్ టన్నులు కోనుగోలు చేసి... కిలో 25 రూపాయలకే అందిస్తున్నామని వివరించారు. టమాట రైతులనూ ఆదుకుంటామన్నారు. సుబాబుల్ రైతులకు 5 కోట్ల వరకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించిందన్నారు.
ఇవీ చదవండి..