ETV Bharat / city

KTR APPRECIATED: తన వాహనానికి చలానా విధించిన పోలీసులపై కేటీఆర్​ ప్రశంసలు - telangana latest news

రాంగ్​రూట్​లో వచ్చిన తన వాహనానికి చలానా విధించిన పోలీసులపై.. తెలంగాణ మంత్రి కేటీఆర్​ ప్రశంసలు కురిపించారు. తన కార్యాలయానికి పిలిపించుకొని శాలువతో సత్కరించారు. నిజాయితీగా వ్యవహరించే అధికారులకు తాము ఎప్పుడు అండగా ఉంటామని మంత్రి స్పష్టం చేశారు.

minister ktr appreciates traffic police
తన వాహనానికి చలానా విధించిన పోలీసులపై కేటీఆర్​ ప్రశంసలు
author img

By

Published : Oct 4, 2021, 3:53 PM IST

రెండు రోజుల క్రితం తన వాహనానికి చలానా విధించిన ట్రాఫిక్​ ఎస్ఐ ఐలయ్య, కానిస్టేబుల్​ వెంకటేశ్వర్లును.. తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ అభినందించారు. తన కార్యాలయానికి పిలిపించుకొని సత్కరించారు. రాంగ్​రూట్​లో వచ్చిన తన వాహనానికి సైతం నిబంధనల ప్రకారం చలానా విధించడంపై ప్రశంసలు కురిపించారు. తన వాహనంపై ఉన్న చలానాను చెల్లించారు. సామాన్యులైనా.. ప్రజాప్రతినిధులైనా నిబంధనలు ఒక్కటేనని కేటీఆర్​ స్పష్టం చేశారు. ట్రాఫిక్​ నియమాలు పాటించడంలో తాను ఎప్పుడూ ముందే ఉంటానని కేటీఆర్​ అన్నారు. చలానా విధించిన రోజు తాను వాహనంలో లేనని స్పష్టం చేశారు.

సరైన సందేశం ఇచ్చేందుకే..

విధి నిర్వహణలో నిజాయతీగా వ్యవహరించే అధికారులకి తాము ఎప్పుడూ అండగా ఉంటామని కేటీఆర్​ అన్నారు. ఈ విషయంలో తమ పార్టీ కార్యకర్తలు, నాయకులకూ సరైన సందేశం ఇచ్చేందుకే ట్రాఫిక్​ సిబ్బందిని అభినందించానని.. ఈ విషయాన్ని తెరాస శ్రేణులు గుర్తించాలని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.

అక్టోబర్​ 2న మహాత్మాగాంధీ జయంతి కార్యక్రమం సందర్భంగా.. లంగర్‌హౌస్‌ సంగం సమీపంలో మంత్రి కేటీఆర్​ వాహనం రాంగ్​ రూట్​లో వచ్చింది. ఆ సమయంలో విధుల్లో ఉన్న ట్రాఫిక్​ ఎస్ఐ ఐలయ్య, కానిస్టేబుల్​ వెంకటేశ్వర్లు సదరు వాహనానికి చలానా విధించారు.

ఇదీచూడండి:

SUICIDE ATTEMPT: హైకోర్టు ముందు దంపతుల ఆత్మహత్యాయత్నం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.