వైకాపా ప్రభుత్వం వాస్తవికతతో కూడిన అభివృద్ది చేస్తోందని మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. వికేంద్రీకరణతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని స్పష్టం చేశారు. అమరావతిపై హైకోర్టు వెలువరించిన తీర్పుపై స్పందించిన ఆయన..మూడు రాజధానుల అంశానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. అమరావతి రైతులకు జగన్ క్షమాపణలు చెప్పాలన్న జనసేన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. చంద్రబాబు ఇచ్చిన స్కిప్ట్‌ను పవన్ ఫాలో అవుతున్నారని ఎద్దేవా చేశారు.
ఉద్యోగుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం..
ఉద్యోగుల సంక్షేమానికి తమ ప్రభుత్వం ఎప్పుడు కట్టుబడి ఉంటుందని కన్నబాబు స్పష్టం చేశారు. విజయవాడలోని ఏపీఎన్జీవో కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చరల్ ఎంప్లాయ్స్ సర్వీస్ అసోసియేషన్ డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొని డైరీ ఆవిష్కరించారు. ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వంలో భాగమేనని.. కరోనా కష్టకాలంలోనూ మెరుగైన పీఆర్సీ ఇచ్చిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతుందన్నారు. ఉద్యోగులకు మేలు చేసేందుకు తమ ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి
CM Jagan Review: ఇప్పుడేం చేద్దాం?.. హైకోర్టు తీర్పుపై సీఎం జగన్ సమీక్ష