భూసారం పెంపు, రైతులకు రెట్టింపు ఆదాయం, రసాయనాల వినియోగాన్ని తగ్గించటం, ప్రజారోగ్యం లాంటి అంశాలకు ప్రాధాన్యతనిస్తూ.. రాష్ట్రంలో సేంద్రీయ వ్యవసాయ పాలసీని తీసుకువస్తామని వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు స్పష్టం చేశారు. ఈ మేరకు సేంద్రీయ వ్యవసాయ విధానం రూపకల్పనపై ఉన్నతాధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. భూసారం పెంచటంతో పాటు రైతులకు రెట్టింపు ఆదాయం వచ్చేలా చేయటం కూడా సేంద్రీయ వ్యవసాయంలో భాగమన్నారు. అందుకు సంబంధించిన విధివిధానాల్ని రూపొందించాల్సిందిగా వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారులను మంత్రి ఆదేశించారు.
పురుగు మందులు, రసాయనాల వినియోగం తగ్గించేలా నూతన విధానంలో నిబంధనలు తేవాల్సిందిగా అధికారులకు సూచించారు. డిమాండ్ మేరకే ఉత్పత్తి చేసేలా వ్యవసాయ, ఉద్యాన ప్రణాళికలు ఉండాలన్నారు. రైతులు, నిపుణులుతో చర్చించి నూతన సేంద్రీయ వ్యవసాయ విధానానికి రూపకల్పన చేయాల్సిందిగా మంత్రి కన్నబాబు అధికారులకు సూచించారు.
ఇదీచదవండి
పేదలపై ఆర్థిక భారం పడకుండా ఉండేందుకే.. వైఎస్ఆర్ బీమా: సీఎం జగన్