హెరిటేజ్ కంపెనీ పరువు నష్టం కేసులో రాష్ట్ర మంత్రి కురసాల కన్నబాబు, ఎమ్మెల్యే అంబటి రాంబాబు హైదరాబాద్లోని నాంపల్లి ప్రజా ప్రతినిధుల కోర్టుకు హాజరయ్యారు. పరువు నష్టం కలిగించేలా.. కన్నబాబు, అంబటి రాంబాబు మాట్లాడారన్న అభియోగంతో.. 2017లో హెరిటేజ్ ప్రతినిధి సాంబమూర్తి ఫిర్యాదు చేశారు. దీనిపై.. ప్రజా ప్రతినిధుల కోర్టులో నేడు విచారణ జరిగింది. ఫిర్యాదులోని ఆరోపణలను ఇరువురు తోసిపుచ్చారు. పిటిషన్పై తదుపరి విచారణను.. న్యాయస్థానం ఈనెల 11కు వాయిదా వేసింది.
ఇదీ చదవండి:
ప్రకాశం జిల్లాలో సీబీఐ సోదాలు.. రూ.228 కోట్ల మోసం గుర్తింపు..!