ETV Bharat / city

Jogi Ramesh డిసెంబర్ 2023లోపు 30లక్షల ఇళ్లు పూర్తి చేయాలన్న మంత్రి జోగి రమేష్

Minister Jogi Ramesh గృహనిర్మాణ పథకం అమలుపై మంత్రి జోగి రమేష్ సమీక్షించారు. జిల్లాల్లో ఇళ్ల నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. డిసెంబర్ 2023లోపు 30లక్షల ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలన్నారు.

Minister Jogi Ramesh
మంత్రి జోగి రమేష్
author img

By

Published : Aug 26, 2022, 2:11 PM IST

Minister Jogi Ramesh వచ్చే ఏడాది డిసెంబరులోగా 30 లక్షల ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసేలా ప్రణాళిక చేయాలని గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ అధికారులను ఆదేశించారు. విజయవాడలోని నిర్మాణ్ భవన్​లో గృహనిర్మాణ పథకం అమలుపై ఉన్నతాధికారులు, జిల్లాల గృహనిర్మాణశాఖ అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాల్లో ఇళ్ల నిర్మాణానికి త్వరితగతిన పూర్తి చేయాలని మంత్రి సూచించారు. ఉన్నతాధికారులు కూడా క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యల్ని పరిష్కరించాల్సిందిగా మంత్రి ఆదేశించారు. 2023 డిసెంబరులోగా నిర్దేశిత ఇళ్ల నిర్మాణ లక్ష్యాన్ని చేరుకోవాలని మంత్రి స్పష్టం చేశారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.