విజయవాడ గుణదలలో ఆధునికీకరించిన ఈఎస్‌ఐ డిస్పెన్సరీని మంత్రి జయరాం ప్రారంభించారు. ఆన్‌లైన్ ద్వారా ప్రతి కార్మికుడికి సేవలు అందిస్తున్నామని చెప్పారు. మెరుగైన వైద్యం అందించడానికి నాడు నేడు కింద ఆసుపత్రులను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు.
చాలా డిస్పెన్సరీలకు సొంత స్థలాలు లేవని పేర్కొన్నారు. అవినీతికి తావు లేకుండా ఉండాలనే ఆన్‌లైన్ డిస్పెన్సరీని ఏర్పాటు చేశామని చెప్పారు. తమ ప్రభుత్వం ప్రజల ఆరోగ్య భద్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తోందని.. ఈఎస్‌ఐ ఆసుపత్రుల ఆధునీకరణకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
ఇదీ చదవండి: