ETV Bharat / city

కాన్సెప్ట్ సిటీల అభివృద్ధికి సహకరించండి: జపాన్ బృందానికి మంత్రి గౌతమ్ విజ్ఞప్తి

author img

By

Published : Feb 9, 2021, 6:33 PM IST

ఆంధ్రప్రదేశ్​లో కాన్సెప్టు సిటీల అభివృద్ధికి సహకారం అందించాలని జపాన్ కాన్సులేట్ జనరల్ మసాయుకి టాగాను పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి కోరారు. విజయవాడలో పర్యటిస్తున్న జపాన్ కాన్సులేట్ జనరల్​తో మంత్రి భేటీ అయ్యారు.

minister gauthamreddy meeting with japan consulate general

ఆంధ్రప్రదేశ్​లో మౌలిక సదుపాయాల అభివృద్ధి, పెట్టుబడుల కోసం జపాన్ సహకారాన్ని ఆశిస్తున్నట్టు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి స్పష్టం చేశారు. చెన్నైలోని జపాన్ రాయబార కార్యాలయం నుంచి ఏపీ పర్యటనకు వచ్చిన ఆ దేశ ప్రతినిధుల బృందం ముఖ్యమంత్రి వైఎస్ జగన్​తోనూ భేటీ అయ్యింది. ప్రస్తుతం ఏపీలో మౌలిక సదుపాయాల కల్పన వేగవంతం చేసినట్టు జపాన్ బృందానికి మంత్రి గౌతమ్​రెడ్డి వివరించారు.

పారిశ్రామిక కారిడార్లతో పాటు పోర్టులు, ఫిషింగ్ హార్బర్లను అభివృద్ధి చేస్తున్నట్టు తెలిపారు. శ్రీకాళహస్తిలో జపాన్ ఇండస్ట్రియల్ టౌన్ షిప్ నిర్మాణానికి సంబంధించిన వివరాలను కూడా కాన్సులెట్ జనరల్​కు వెల్లడించారు. ప్రస్తుతం శ్రీసిటిలో జపాన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మాన్యుఫ్యాక్చరింగ్ సేవలందిస్తోందని .. దీన్ని రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకూ విస్తరించే అవకాశాన్ని పరిశీలిస్తామని జపాన్ ప్రతినిధి బృందం వెల్లడించంది.

ఇదీ చదవండి:

పంచాయతీ ఎన్నికలు 2021: పోలింగ్ పూర్తి.. కౌంటింగ్ షురూ..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.