జీఎస్టీ వల్ల రాష్ట్రాల ఆదాయం తగ్గుతోందని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. లఖ్‌నవూలో నిర్వహించిన జీఎస్టీ మండలి సమావేశంలో ప్రభుత్వం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ్తో కలిసి ఆయన పాల్గొన్నారు. జీఎస్టీ ముందు వృద్ధి రేటు 17 శాతం ఉంటే ఇప్పుడు భిన్నమైన పరిస్థితి ఏర్పడిందన్నారు. సమావేశం ముగిశాక మీడియాతో మాట్లాడిన ఆయన..జీఎస్టీ వచ్చాక రాష్ట్ర వృద్ధి రేటు 10 శాతానికే పరిమితమైందన్నారు.
"పెట్రో ఉత్పత్తులపై గతంలో చెప్పిన వైఖరికే కట్టుబడి ఉన్నాం. రాష్ట్రాలకు ఇచ్చే పరిహారం చెల్లింపును ఏటా తప్పక పూర్తి చేయాలి. కరోనా వల్ల అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై తీవ్ర ప్రభావం ఉంది. కరోనాతో ఆర్థిక పరిస్థితులు సానుకూలంగా లేవు. ఏపీకి పరిహారం రూపంలో రావాల్సిన అదనపు నిధులు ఇవ్వాలి. ఏపీకి 2021 ఆగస్టు వరకు చెల్లించాల్సిన పరిహారం విడుదల చేయాలి. 14 శాతం వృద్ధి భరోసా పరిహారం 2022 వరకు పొడిగించాలని కోరాం. ఏపీ నుంచి ఎగుమతయ్యే నాపరాయి పలకలపై జీఎస్టీ గురించి అడిగాం. నాపరాయిపై పన్ను రేటును 18 నుంచి 5 శాతానికి తగ్గించాలని కోరాం. సౌరవిద్యుత్ ప్లాంట్లు, మద్యం జాబ్‌వర్క్‌పై పన్ను 5 శాతానికి తగ్గించాలని కోరాం." - బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, రాష్ట్ర ఆర్థిక మంత్రి
ఇదీ చదవండి
CM Jagan: గిరిజనుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాం: సీఎం జగన్