MINISTER BOTSA ఆంధ్రప్రదేశ్ సీపీఎస్ ఉద్యోగుల అసోసియేషన్‌తో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ భేటీ అయ్యారు. 'చలో విజయవాడ', మిలియన్ మార్చ్ కార్యక్రమం వాయిదా వేసుకోవాలని ఉద్యోగ సంఘాలను కోరారు. ఉద్యోగ సంఘాల నిరసనల నేపథ్యంలో ఏపీసీపీఎస్ఈఏ ఉద్యోగ సంఘాల నాయకుల ఇళ్లపై పోలీసుల నిఘా పెట్టారు. రేపు ఈ రెండు సంఘాలతో ఆర్థిక మంత్రి సహా మంత్రుల సంప్రదింపుల కమిటీతో మరోసారి భేటీ కానున్నారు.
ఇదీ సంగతి: కాంట్రిబ్యూటరీ పింఛన్ పథకాన్ని (సీపీఎస్) రద్దు చేయాలనే డిమాండ్‌తో సీపీఎస్ ఉద్యోగ సంఘాలు ఆందోళనలకు సిద్ధమయ్యాయి. సీపీఎస్ విధానం అమల్లోకి వచ్చిన సెప్టెంబరు 1న సీపీఎస్ ఉద్యోగుల సంఘం (సీపీఎస్‌యూఎస్) సీఎం జగన్ ఇంటి ముట్టడికి పిలుపునిచ్చింది. మరోవైపు సీపీఎస్ ఎంప్లాయిస్ అసోసియేషన్ (సీపీఎస్‌ఈఏ) విజయవాడలో భారీ సభకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ కార్యక్రమాలకు పోలీసులు అనుమతులు ఇవ్వలేదు. అయినా ఆందోళనలు కొనసాగించాలని సీపీఎస్ ఉద్యోగ సంఘాలు సమాయత్తమవుతుండగా.. అడ్డుకోవడానికి పోలీసులు అడుగడుగునా నిర్బంధాలు మొదలుపెట్టారు. ఆందోళనలను వాయిదా వేయించేందుకు సీపీఎస్ ఉద్యోగ సంఘాల నేతలతో మంత్రులు చర్చలు జరుపుతున్నారు.
మంత్రి బొత్స సత్యనారాయణ విజయవాడలోని తన క్యాంపు కార్యాలయంలో బుధవారం ఏపీసీపీఎస్‌యూఎస్ ఉద్యోగ నాయకులతో రెండు గంటలపాటు చర్చించారు. సీపీఎస్, జీపీఎస్, ఓపీఎస్ విధానంలో ఉన్న తేడాలను నాయకులు మంత్రికి వివరించారు. సీపీఎస్‌ఈఏను చర్చలకు ఆహ్వానించగా ఓపీఎస్‌పై తప్ప, జీపీఎస్‌పై మాట్లాడేందుకు తాము రాబోమని తిరస్కరించారు. దీంతో గురువారం రావాలని సూచించారు. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డితో కలిసి శుక్రవారం మరోసారి చర్చలు నిర్వహించాలని నిర్ణయించారు.
ఇవీ చదవండి: