ETV Bharat / city

'వరదలు తగ్గితే.. ఆగస్టు మొదటి వారంలో పోలవరం పనులు' - గోదావరి వరదలపై మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యలు

AMBATI RAMBABU ON FLOODS : రాష్ట్రంలో వరద సహాయక చర్యలు ముమ్మరం చేశామని మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. ప్రాజెక్టుల వద్ద వరద పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామన్నారు. ఆగస్టు 17న నెల్లూరు, సంగం బ్యారేజీలను ముఖ్యమంత్రి ప్రారంభిస్తారని అంబటి రాంబాబు తెలిపారు.

AMBATI RAMBABU
AMBATI RAMBABU
author img

By

Published : Jul 14, 2022, 9:06 PM IST

'వరద పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నాం'

AMBATI RAMBABU ON FLOODS : వందేళ్లలో గోదావరి నదికి జులై నెలలో ఇంతటి వరద రాలేదని.. ఊహకు అందని విధంగా వరదలు వచ్చినందున కొన్ని ఇబ్బందులు తలెత్తాయని రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. వరద సహాయక చర్యలను ముమ్మరం చేశామని విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో చెప్పారు. ప్రాజెక్టుల వద్ద వరద పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామన్నారు. వరద ప్రాంతాల నుంచి నిర్వాసితులని తరలించేందుకు అన్ని చర్యలు తీసుకున్నామన్నారు.

గోదావరిలో వరద కనీసంగా 2 లక్షల క్యూసెక్కులకు తగ్గితేగాని పోలవరం ప్రాజెక్టు దిగువ కాఫర్‌ డ్యాం ప్రాంతంలో పనులు చేయడానికి అవకాశం ఏర్పడదని అధికారులు అన్నారని మంత్రి తెలిపారు. వరదలు పూర్తిగా తగ్గితే.. ఆగస్టు మొదటివారంలో పనులు తిరిగి ప్రారంభించేందుకు అవకాశం ఏర్పడుతుందన్నారు. ఆగస్టు 17న నెల్లూరు, సంగం బ్యారేజీలను ముఖ్యమంత్రి ప్రారంభిస్తారని మంత్రి అంబటి రాంబాబు తెలిపారు.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.