రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు అందిస్తున్న విద్యాకానుక సరఫరాలో ఆలస్యాన్ని సహించేది లేదని మంత్రి ఆదిమూలపు సురేశ్ అధికారులకు స్పష్టం చేశారు. విద్యాకానుకలో భాగంగా ఇస్తున్న అన్ని వస్తువులు నూరుశాతం జిల్లాలకు చేరాలని.. వర్చువల్‌గా నిర్వహించిన సమీక్షలో ఆదేశించారు.
గడువులోగా కిట్లు పంపిణీ చేయకపోతే తప్పనిసరిగా జరిమానా విధించనున్నట్లు మంత్రి అధికారులను హెచ్చరించారు. అదనంగా అందిస్తున్న నిఘంటువును సైతం కిట్లో చేర్చి విద్యార్థులకు అందించాలని ఆయన దిశానిర్దేశం చేశారు.
ఇదీ చదవండి: