ETV Bharat / city

Agrigold : అన్ని రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకోవాలి: ముప్పాళ్ల

ఏపీ తరహాలోనే మిగిలిన రాష్ట్రాల్లో అగ్రి గోల్డ్‌ బాధితులకు ప్రభుత్వాలు న్యాయం చేయాలని అగ్రిగోల్డ్‌ బాధితులు, ఏజెంట్ల సంక్షేమ సంఘం గౌరవాధ్యక్షుడు ముప్పాళ్ల నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. 31 లక్షల మందితో అగ్రిగోల్డ్ ఫెడరేషన్ ఏర్పాటు చేశామని తెలిపారు.

agri gold representatives meeting
అన్ని రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకోవాలి
author img

By

Published : Mar 28, 2022, 9:38 AM IST

అన్ని రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకోవాలి

Agri Gold: ఏపీ తరహాలోనే మిగిలిన రాష్ట్రాల్లో అగ్రిగోల్డ్‌ బాధితులకు ప్రభుత్వాలు న్యాయం చేయాలని అగ్రి గోల్డ్‌ బాధితులు, ఏజెంట్ల సంక్షేమ సంఘం గౌరవాధ్యక్షుడు ముప్పాళ్ల నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. ఏపీ, కర్ణాటక, తెలంగాణ, ఒడిశా రాష్ట్రాలకు చెందిన 150 మంది ప్రతినిధులతో ఆదివారం విజయవాడ దాసరి భవన్‌లో సమావేశం నిర్వహించారు. 31 లక్షల మందితో అగ్రిగోల్డ్ ఫెడరేషన్ ఏర్పాటు చేశామన్నారు. అగ్రిగోల్డ్‌కు సంబంధించిన కేసులను తెలంగాణ నుంచి ఏలూరు కోర్ట్‌కి బదిలీ చేశారని తెలిపారు. ఇకపై ఏలూరు కోర్టులోనే న్యాయపోరాటం చేస్తామన్నారు.

తమ రాష్ట్ర ముఖ్యమంత్రి 8.50 లక్షల మంది బాధితులకు న్యాయం చేయడంలో తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారని కర్ణాటక అగ్రి గోల్డ్ బాధితుల సంఘం అధ్యక్షుడు గురుమూర్తి అన్నారు.

ఇదీ చదవండి: పాపవినాశనం రహదారిపై ఏనుగులు... అప్రమత్తమైన అటవీశాఖ సిబ్బంది

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.