ETV Bharat / city

తెలంగాణలో మేయర్లు, ఛైర్​పర్సన్ల ఎన్నికకు ముహూర్తం ఖరారు - పురపోరు

తెలంగాణలోని నగరాలు, పట్టణాల ప్రథమ పౌరులెవరన్నది ఈ నెల 27న తేలనుంది. మేయర్లు, ఛైర్​పర్సన్ల ఎన్నిక కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లు, కౌన్సిలర్లు చేతులెత్తే విధానంలో మేయర్లు, ఛైర్​పర్సన్లను ఎన్నుకోనున్నారు. ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు 25లోగా నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.

mayor-chairpersons-elections-in-telangana
mayor-chairpersons-elections-in-telangana
author img

By

Published : Jan 23, 2020, 8:54 PM IST

Updated : Jan 23, 2020, 11:45 PM IST

తెలంగాణలో పురపాలక ఎన్నికల పోలింగ్ పూర్తైన నేపథ్యంలో మేయర్లు, ఛైర్​పర్సన్ల ఎన్నికకు ముహూర్తం ఖరారైంది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నెల 27న ఇందుకోసం పరోక్ష ఎన్నిక జరగనుంది. ఎన్నిక నిర్వహించేందుకు వీలుగా జిల్లా కలెక్టర్లు నియమించిన అధికారులు 25న నోటీసు జారీ చేస్తారు. అందుకు అనుగుణంగా 27న పాలకమండళ్ల ప్రత్యేక సమావేశం నిర్వహిస్తారు. కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లు, కౌన్సిలర్లు ఉదయం 11 గంటలకు ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆ తర్వాత 12 గంటల 30 నిమిషాలకు ఎన్నిక నిర్వహిస్తారు.

కోరం ఉంటేనే మేయర్​, ఛైర్​పర్సన్​ ఎన్నిక

కనీసం సగం మంది ఎన్నికైన సభ్యులు, ఎక్స్ అఫీషియో సభ్యులు (కోరం) ఉంటేనే మేయర్, ఛైర్​పర్సన్ ఎన్నిక నిర్వహించాల్సి ఉంటుంది. అధ్యక్షుల ఎన్నిక కోసం ఒక సభ్యుడు పేరును ప్రతిపాదిస్తే మరో సభ్యుడు బలపరచాల్సి ఉంటుంది. రాజకీయ పార్టీ ప్రతినిధి తరపున అభ్యర్థి అయితే సంబంధిత పార్టీ నుంచి ధ్రువీకరణ పత్రాన్ని ఎన్నిక నిర్వహించే అధికారికి ఉదయం పది గంటల్లోపు అందించాల్సి ఉంటుంది. పోటీలో ఒకరు మాత్రమే ఉంటే ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటిస్తారు. ఇద్దరు లేదా అంతకు మించి అభ్యర్థులు పోటీలో ఉంటే సమావేశంలో ఉన్న సభ్యులు చేతులు ఎత్తి ఓట్లు వేయాల్సి ఉంటుంది. ఎక్కువ ఓట్లు వచ్చిన వారిని మేయర్, ఛైర్​పర్సన్​గా ప్రకటిస్తారు. ఇద్దరికీ సమానంగా ఓట్లు వస్తే లాటరీ పద్ధతిన విజేతను ఎంపిక చేస్తారు.

రెండు రోజులు ఎన్నిక జరగకపోతే..

మేయర్, ఛైర్​పర్సన్ ఎన్నికకు విప్ వర్తిస్తుంది. రాజకీయ పార్టీ తరపున ఒక సభ్యుణ్ని విప్​గా నియమించుకోవచ్చు. పార్టీ ఇచ్చిన విప్​ను ధిక్కరించే వారు వారి సభ్యత్వాన్ని కోల్పోతారు. మేయర్, ఛైర్‌ పర్సన్ ఎన్నిక పూర్తయ్యాకే డిప్యూటీ మేయర్, డిప్యూటీ ఛైర్​పర్సన్ ఎన్నిక చేపట్టాల్సి ఉంటుంది. మేయర్, ఛైర్​పర్సన్ ఎన్నిక పూర్తి కాకుండా డిప్యూటీల ఎన్నిక నిర్వహించకూడదు. నోటీసు ఇచ్చిన రోజు ఎన్నిక జరగకపోతే మరుసటి రోజు నిర్వహించాలి. వరుసగా రెండు రోజులు ఎన్నిక జరగకపోతే ఆ విషయాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘానికి నివేదించాల్సి ఉంటుంది. ఆ ఎన్నిక కోసం ఎస్ఈసీ విడిగా నోటిఫికేషన్ ఇస్తుంది.

ఎక్స్​ అఫీషియో సభ్యులుగా నమోదు చేసుకోవాలి..

ఎక్స్ అఫీషియో సభ్యులుగా పేర్లు నమోదు చేసుకునేందుకు 25వ తేదీ వరకు గడువు ఉంది. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎక్స్ అఫీషియో సభ్యులుగా నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. నమోదు చేసుకున్న వారికి మాత్రమే ఓటుహక్కు ఉంటుంది. ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఎవరైనా తాము ప్రాతినిధ్యం వహిస్తోన్న ప్రాంతంలోని ఒక పురపాలిక లేదా నగరపాలికలో ఎక్స్ అఫీషియో సభ్యునిగా నమోదు చేసుకోవచ్చు. ఎక్స్ అఫీషియో సభ్యులు కూడా మేయర్, ఛైర్ పర్సన్ ఎన్నికలో ఓటు వేయవచ్చు. ఎక్స్ అఫీషియో సభ్యత్వం కోసం ఒక చోట నమోదు చేసుకున్నాక మళ్లీ మార్పులు, చేర్పులకు అవకాశం ఉండదు.

ఇవీ చూడండి: 'మంత్రిని కాకపోతే ఎయిరిండియాను కొనేవాడిని'

తెలంగాణ మేయర్లు, ఛైర్​పర్సన్ల ఎన్నికకు ముహూర్తం ఖరారు

File : TG_Hyd_46_23_Mayor_Chairpersons_Elections_Pkg_3053262 From : Raghu Vardhan ( ) నగరాలు, పట్టణాల ప్రథమ పౌరులెవరన్నది ఈ నెల 27న తేలనుంది. మేయర్లు, ఛైర్ పర్సన్ల ఎన్నిక కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. కొత్తగా ఎన్నికైన కార్పోరేటర్లు, కౌన్సిలర్లు చేతులెత్తే విధానంలో మేయర్లు, ఛైర్ పర్సన్లను ఎన్నుకోనున్నారు. ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు 25వ తేదీలోగా నమోదు చేసుకోవాల్సి ఉంటుంది...లుక్ వాయిస్ ఓవర్ - పురపాలక ఎన్నికల పోలింగ్ పూర్తైన నేపథ్యంలో మేయర్లు, ఛైర్ పర్సన్ల ఎన్నిక ముహూర్తం ఖరారైంది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నెల 27వ తేదీన ఇందుకోసం పరోక్ష ఎన్నిక జరగనుంది. ఎన్నిక నిర్వహించేందుకు వీలుగా జిల్లా కలెక్టర్లు నియమించి అధికారులు 25వ తేదీన నోటీసు జారీ చేస్తారు. అందుకు అనుగుణంగా 27వ తేదీన పాలకమండళ్ల ప్రత్యేక సమావేశం నిర్వహిస్తారు. కొత్తగా ఎన్నికైన కార్పోరేటర్లు, కౌన్సిలర్లు ఉదయం 11 గంటలకు ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆ తర్వాత 12 గంటలా 30 నిమిషాలకు ఎన్నిక నిర్వహిస్తారు. కనీసం సగం మంది ఎన్నికైన సభ్యులు, ఎక్స్ అఫీషియో సభ్యుల కోరం ఉంటేనే మేయర్, ఛైర్ పర్సన్ ఎన్నిక నిర్వహించాల్సి ఉంటుంది. అధ్యక్షుల ఎన్నిక కోసం ఒక సభ్యుడు పేరును ప్రతిపాదిస్తే మరో సభ్యుడు బలపరచాల్సి ఉంటుంది. రాజకీయ పార్టీ ప్రతినిధి తరపున అభ్యర్థి అయితే సంబంధిత పార్టీ నుంచి ధృవీకరణ పత్రాన్ని ఎన్నిక నిర్వహించే అధికారికి ఉదయం పది గంటల్లోపు అందించాల్సి ఉంటుంది. పోటీలో ఒకరు మాత్రమే ఉంటే ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటిస్తారు. ఇద్దరు లేదా అంతకు మించి అభ్యర్థులు పోటీలో ఉంటే సమావేశంలో ఉన్న సభ్యులు చేతులు ఎత్తి ఓట్లు వేయాల్సి ఉంటుంది. ఎక్కువ ఓట్లు వచ్చిన వారిని మేయర్, ఛైర్ పర్సన్ గా ప్రకటిస్తారు. ఇద్దరికీ సమానంగా ఓట్లు వస్తే లాటరీ పద్ధతిన విజేతను ఎంపిక చేస్తారు. మేయర్, ఛైర్ పర్సన్ ఎన్నికకు విప్ వర్తిస్తుంది. రాజకీయ పార్టీ తరపున ఒక సభ్యుణ్ని విప్ గా నియమించుకోవచ్చు. పార్టీ ఇచ్చిన విప్ ను ధిక్కరించే వారు వారి సభ్యత్వాన్ని కోల్పోతారు. మేయర్, ఛైర్‌ పర్సన్ ఎన్నిక పూర్తయ్యాకే డిప్యూటీ మేయర్, డిప్యూటీ ఛైర్ పర్సన్ ఎన్నిక చేపట్టాల్సి ఉంటుంది. మేయర్, ఛైర్ పర్సన్ ఎన్నిక పూర్తి కాకుండా డిప్యూటీల ఎన్నిక నిర్వహించకూడదు. నోటీసు ఇచ్చిన రోజు ఎన్నిక జరగకపోతే మరుసటి రోజు మళ్లీ నిర్వహించవచ్చు. వరుసగా రెండు రోజులు ఎన్నిక జరగకపోతే ఆ విషయాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘానికి నివేదించాల్సి ఉంటుంది. ఆ ఎన్నిక కోసం ఎస్ఈసీ విడిగా నోటిఫికేషన్ ఇస్తుంది. ఎక్స్ అఫిషియో సభ్యులుగా పేర్లు నమోదు చేసుకునేందుకు 25వ తేదీ వరకు గడవు ఉంది. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎక్స్ అఫిషియో సభ్యులుగా నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. నమోదు చేసుకున్న వారికి మాత్రమే ఓటుహక్కు ఉంటుంది. ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఎవరైనా తాము ప్రాతినిధ్యం వహిస్తోన్న ప్రాంతంలోని ఒక పురపాలిక లేదా నగరపాలికలో ఎక్స్ అఫిషియో సభ్యునిగా నమోదు చేసుకోవచ్చు. ఎక్స్ అఫీషియో సభ్యులు కూడా మేయర్, ఛైర్ పర్సన్ ఎన్నికలో ఓటు వేయవచ్చు. ఎక్స్ అఫీషియో సభ్యత్వం కోసం ఒక చోట నమోదు చేసుకున్నాక మళ్లీ మార్పులు, చేర్పులకు అవకాశం ఉండదు.
Last Updated : Jan 23, 2020, 11:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.