మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలల్లో జరిగిన అక్రమాలను ఎస్ఈసీ దృష్టికి తీసుకువెళ్లేందుకు అభ్యర్థులు క్యూ కడుతున్నారు. రెండంకెల మెజారిటీ దాటని చోట్ల ఒకటికి రెండు మార్లు పరిశీలించాలని స్పష్టమైన ఆదేశాలు ఉన్నా.. రిటర్నింగ్ అధికారులు ఖాతరు చేయకపోవడంతో పలు సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ కారణంగా క్షేత్రస్థాయిలో ఫలితాలు తారుమారు అవుతున్నాయని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం మారెళ్ల పంచాయతీలో ఓటమి పాలైన అభ్యర్థి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాడు. వైకాపా మద్దతు ఇచ్చిన అభ్యర్థికే రిటర్నింగ్ అధికారి కొమ్ము కాశారంటూ వాపోయాడు. గెలుపు, ఓటమికి ఒక్క ఓటు తేడా వచ్చిందని రీకౌంటింగ్ కోరినా పట్టించుకోకుండా.. రిటర్నింగ్ అధికారి ఫలితం ప్రకటించేశారని పేర్కొన్నాడు. దానికి తోడు నమోదు కాని మూడు ఓట్లను ఆర్వో లెక్కల్లో చూపారని ఆరోపించాడు.
ఇదీ చదవండి:
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై ప్రధానికి చంద్రబాబు లేఖ