ETV Bharat / city

Barytes: అమెరికా మార్కెట్​లో మంగంపేట బెరైటీస్ ఖనిజాలు.. కొనుగోలుకు సిద్ధమైన కంపెనీలు..!

Barytes: ప్రపంచంలోనే అత్యధిక బెరైటీస్ ఖనిజ నిల్వలను కలిగివున్న మంగంపేట బెరైటీస్ ప్రాజెక్ట్ అమెరికా మార్కెట్​లోనూ వాటాను పెంచుకునేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. తాజాగా గనులశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ వీసీఎండీ (V.C.M.D) వి.జి వెంకటరెడ్డిలు ఈ నెల 16 నుంచి 22వ తేదీ వరకు అమెరికాలో పర్యటించారు. ఇంధన రంగానికి చెందిన కంపెనీల ముఖ్య కార్యాలయాలు అధికంగా ఉన్న టెక్సాస్, హుస్టన్​లో పలు సంస్థలతో భేటీ అయ్యారు.

barytes
అమెరికా మార్కెట్​లో మంగంపేట బెరైటీస్ ఖనిజాలు
author img

By

Published : May 24, 2022, 8:44 AM IST

Barytes: ప్రపంచంలోనే అత్యధిక బెరైటీస్ ఖనిజ నిల్వలను కలిగివున్న మంగంపేట బెరైటీస్ ప్రాజెక్ట్ అమెరికా మార్కెట్​లోనూ వాటాను పెంచుకునేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. మిడిల్ ఈస్ట్ దేశాల్లో ప్రధాన బెరైటీస్ ఎగుమతిదారుగా ఉన్న ఏపీఏండీసీ (A.P.M.D.C) తాజాగా అమెరికన్ మార్కెట్​లోను బెరైటీస్ అమ్మకాలు జరపాలని నిర్ణయించారు. తాజాగా గనులశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ వీసీఎండీ (V.C.M.D) వి.జి వెంకటరెడ్డిలు ఈ నెల 16 నుంచి 22వ తేదీ వరకు అమెరికాలో పర్యటించారు. ఇంధన రంగానికి చెందిన కంపెనీల ముఖ్య కార్యాలయాలు అధికంగా ఉన్న టెక్సాస్, హుస్టన్​లో పలు సంస్థలతో భేటీ అయ్యారు.

ఆయా కంపెనీలకు మంగంపేట ప్రాజెక్ట్ నుంచి ఉత్పత్తి చేస్తున్న బెరైటీస్ పై అవగాహన కల్పించారు. దీనిపై సంతృప్తి చెందిన మూడు కంపెనీలు రానున్న మూడేళ్లలో సుమారు 750 కోట్ల రూపాయల విలువైన 16 లక్షల టన్నుల బెరైటీస్​ను కొనుగోలు చేసేందుకు ముందుకు వచ్చాయి. అమెరికాకు చెందిన మూడు కంపెనీలతో బెరైటీస్ విక్రయాలపై ఎంఓయు (M.O.U) కుదుర్చుకున్నట్లు గనులశాఖ ముఖ్య కార్యదర్శి వెల్లడించారు. అలాగే మరో 250 కోట్ల రూపాయల విలువైన బెరైటీస్ కొనుగోలుకు ఎంఓయు (M.O.U)లు కుదిరే అవకాశం ఉందని అన్నారు. వివిధ దేశాల నుంచి ఎగుమతి అవుతున్న బెరైటీస్​తో పోలిస్తే మంగంపేట నుంచి అందించే ఖనిజంలో నాణ్యత, ధరల్లో వ్యత్యాసం, పారదర్శకమైన ఎగుమతి విధానంపై పలు అమెరికన్ కంపెనీలు ఆసక్తి చూపించాయని తెలిపారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.