Manda Krishna: ఎస్సీ వర్గీకరణ పట్ల వైకాపా ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యంతో ఉందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ విమర్శించారు. మాదిగలకు అన్యాయం జరిగిందని తొలుత ఎన్టీఆర్ గుర్తిస్తే.. అందుకు కొనసాగింపుగా చంద్రబాబు వ్యవహరించారని ఆయన గుర్తుచేశారు. చంద్రబాబు వల్లే వర్గీకరణ ఫలాలు మాదిగలకు దక్కాయని తెలిపారు. విజయవాడలో తెదేపా నేత వర్ల రామయ్యను మందకృష్ణ మాదిగ ఆయన నివాసంలో కలిశారు.
కేంద్రంలో ఎస్సీ వర్గీకరణ అంశం ఇంకా పెండింగ్‌లోనే ఉందన్న ఆయన.. చంద్రబాబు దీనిపై చొరవ తీసుకోవాలని కోరారు. మహానాడులో ఎస్సీ వర్గీకరణ పరిష్కారానికి తెదేపా తీర్మానం చేసేందుకు చొరవ చూపాలని వర్లరామయ్యను కోరారు. ఎన్నికల్లో సీట్లకు సంబంధించి మాల-మాదిగ, రెళ్లి ప్రజలకు 50-50 నిష్పత్తిలో సీట్లు కేటాయించేలా చొరవ చూపాలన్నారు. ఎస్సీలందరికీ సమాన రాయితీ ఫలాలు దక్కేలా మందకృష్ణ కృషి చేస్తున్నారని వర్లరామయ్య అన్నారు. మందకృష్ణ లెవనెత్తే అంశాలన్నీ తెదేపా ఆలోచనల్లో ఉన్నవేనని ఆయన స్పష్టంచేశారు.
ఇవీ చదవండి: