ETV Bharat / city

'వారికి సమాధానం చెప్పాల్సిన అవసరం మాకు లేదు’ - మల్లాది విష్ణు తాజా వార్తలు

రాష్ట్రంలో ఎటువంటి ప్రజాబలం లేని భారతీయ జనతా పార్టీకి సమాధానం చెప్పాల్సిన అవసరం తమకు లేదని… బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ మల్లాది విష్ణు చెప్పారు.

malladi vishnu fires on bjp and tdp over ttd lands sale issue
మల్లాది విష్ణు
author img

By

Published : May 24, 2020, 6:50 PM IST

తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన భూముల వేలం ప్రక్రియపై ప్రతిపక్షాలు కావాలనే రాద్ధాంతం చేస్తున్నాయని రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్, ఎమ్మెల్యే మల్లాది విష్ణు వ్యాఖ్యానించారు. 2015లో అధికారంలో ఉన్న తేదేపా తీసుకున్న నిర్ణయాన్ని తాము అమలు చేస్తుంటే లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.

రాష్ట్రంలో ఒక్క సీటు కూడా రాని భాజపాకు, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నాయకులకు తాము సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. దేవాలయ భూముల పరిరక్షణ తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. దేవాలయానికి చెందిన భూములు నిరుపయోగంగా ఉన్నాయని చెప్పారు.

వాటిని అమ్మి ఆ డబ్బును తితిదే ఖాతాలో జమ చేయడంలో తప్పేంటని ప్రశ్నించారు. కేవలం రాజకీయ లబ్ధి కోసమే హిందూ సంఘాలను ప్రతిపక్షాలు రెచ్చగొడుతున్నాయని ఆరోపించారు. ఆ పార్టీలకు ప్రజలే తగిన బుద్ధి చెబుతారని వ్యాఖ్యానించారు.

ఇదీ చదవండీ:

రాష్ట్రంలో కొత్తగా 66 కరోనా పాజిటివ్ కేసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.