తనను వైకాపా నాయకులు మోసం చేశారని మాల మహానాడు మహిళా అధ్యక్షురాలు బొల్లిపల్లి జోని కుమారి ఆరోపించారు. విజయవాడ ప్రెస్ క్లబ్లో ఆత్మహత్యాయత్నం చేశారు. ఆమె మాట్లాడుతూ.. తనను మోసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డిని కలిసినా సమస్య పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తంచేశారు. తనకు జరిగిన అన్యాయంపై ముఖ్యమంత్రిని కలిసి విన్నవించాలని ప్రయత్నించినా అపాయింట్మెంట్ లభించలేదన్నారు.
'నేను వైకాపాకు చెందిన మహిళను. సీఎం జగన్ సమక్షంలోనే పార్టీలో చేరాను. అయితే పార్టీలో కొంతమంది నాయకులు నాకు అన్యాయం చేశారు. బయటకు చెప్పుకోలేని బాధ పడుతున్నాను నేను. ఈ విషయాన్ని ఎంపీ విజయసాయిరెడ్డి దృష్టికి తీసుకెళ్లినా ఎటువంటి స్పందనా లేదు. కరోనా కారణంగా సీఎంను కలవలేకపోయాను. అందుకే మీడియా ముఖంగా నా బాధను తెలియజేస్తున్నాను'-- బొల్లిపల్లి జోని కుమారి, మాల మహానాడు మహిళా అధ్యక్షురాలు
ఇవీ చదవండి...