అక్టోబరు 19వ తేదీ నాటికి మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. తదుపరి ఈ అల్పపీడనం మరింతగా బలపడుతుందని ఐఎండీ భావిస్తోంది.
ప్రస్తుతం దక్షిణ కోస్తాంధ్రకు సమీపంలో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నట్టు అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీంతో నెల్లూరు, ప్రకాశం, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో చాలా చోట్ల మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు కురిశాయి. రాగల 24 గంటల్లో కోస్తాంధ్ర జిల్లాల్లో ఉరుములతో కూడిన జల్లులు పడతాయని వాతావరణశాఖ స్పష్టం చేసింది. రాగల రెండు రోజుల్లో కోస్తాంధ్ర జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ వర్ష సూచన ఉన్నట్టు తెలిపింది.
రాష్ట్రవ్యాప్తంగా వర్షపాతం వివరాలు
ముతుకూర్ ( నెల్లూరు) 8.8 సెంటిమీటర్లు, మామిడికుదురు (తూ.గో) 6.3 సెంటిమీటర్లు, టంగుటూరు (ప్రకాశం) 5.6 సెంటిమీటర్లు, రాజోలు (తూ.గో) 5.5 సెంటిమీటర్లు, నెల్లూరు 4.2 సెంటిమీటర్లు, నల్లజెర్ల (ప.గో) 3.8 సెంటిమీటర్లు,హనుమాన్ జంక్షన్ (కృష్ణా) 3.4 సెంటిమీటర్లు, తనంవారిపల్లె (చిత్తూరు) 3.1 సెంటిమీటర్లు, చీరాల (ప్రకాశం ) 2.4 సెంటిమీటర్లు, రాయదుర్గం (అనంతపురం) 1.6 సెంటిమీటర్లు, యలమంచిలి (విశాఖ) 1.3 సెంటిమీటర్లు.
రాష్ట్రవ్యాప్తంగా నమోదైన ఉష్ణోగ్రతలు
విజయవాడ 33 డిగ్రీలు, విశాఖపట్నం 32 డిగ్రీలు, తిరుపతి 40 డిగ్రీలు, అమరావతి 37 డిగ్రీలు, విజయనగరం 34 డిగ్రీలు, నెల్లూరు 37 డిగ్రీలు, గుంటూరు 34 డిగ్రీలు, శ్రీకాకుళం 32 డిగ్రీలు, కర్నూలు 33 డిగ్రీలు, ఒంగోలు 37 డిగ్రీలు, ఏలూరు 36 డిగ్రీలు, కడప 35 డిగ్రీలు, రాజమహేంద్రవరం 39 డిగ్రీలు, కాకినాడ 34 డిగ్రీలు అనంతపురం 35 డిగ్రీలు.
ఇవీ చదవండి..