ETV Bharat / city

Loss to Farmers: అన్నదాతల ఆశలపై నీళ్లు చల్లిన 'అసని' తుపాను - తుపానుతో ఉద్యాన పంటలకు తీవ్ర నష్టం

Loss to farmers: అసని తుపాను ప్రభావంతో రాష్ట్రంలో కురిసిన వర్షాలకు.. అన్నదాతలకు తీవ్ర నష్టం వాటిల్లింది. పలుచోట్ల కోత కోసిన వరి పనలు నీట నాని మొలకలొస్తున్నాయి. తడిసిన ధాన్యాన్ని ఎలా అమ్ముకోవాలో తెలియక అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.

Loss to farmers due to asani cyclone
అన్నదాతల ఆశలపై నీళ్లు చల్లిన 'అసని' తుపాను
author img

By

Published : May 13, 2022, 10:05 AM IST

Loss to farmers: ధాన్యం రైతుల ఆశలపై అసని తుపాను నీళ్లు చల్లింది. కళ్లాల్లో, రహదారులపై ఆరబెట్టిన వడ్లు రెండు రోజులపాటు కురిసిన భారీ వర్షాలకు తడిసిపోయాయి. అమ్మకానికి తెచ్చి నెల అవుతున్నా.. ప్రభుత్వం తీసుకోకపోవడంతో మరికొందరికి తీవ్ర నష్టం వాటిల్లింది. కొన్నిచోట్ల కోత కోసిన వరి పనలు నీట నాని మొలకలొస్తున్నాయి. తడిసిన ధాన్యాన్ని ఎలా అమ్ముకోవాలో తెలియక అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.

తూర్పు, పశ్చిమగోదావరి, కోనసీమ, కృష్ణా, ఏలూరు, పల్నాడు, నెల్లూరు జిల్లాల్లో వేలాది ఎకరాల్లో వరి దెబ్బతింది. వర్షాలు ఇంకా కొనసాగుతుండటంతో ఆరబెట్టే అవకాశమూ లేక పట్టలు కప్పి, నీరు నిలవకుండా బయటకు పంపేందుకు అన్నదాతలు పడరాని పాట్లు పడుతున్నారు. ధాన్యాన్ని ఆరబెట్టేందుకు, మళ్లీ కుప్ప చేసేందుకు కూలీల ఖర్చు, తడవకుండా కప్పేందుకు పట్టాల వ్యయం రోజుకు రూ.1,500 నుంచి రూ.2 వేలకు పైగా అవుతోందని కర్షకులు కన్నీటి పర్యంతమవుతున్నారు.

ప్రభుత్వం కొనక.. ప్రైవేటుకు అమ్ముకోలేక.. నెల్లూరు జిల్లా ఉలవపాడు మండలం (గతంలో ప్రకాశం జిల్లా) వీరేపల్లిలో చెరువు కింద 400 ఎకరాల్లో రైతులు ధాన్యం పండించారు. పౌర సరఫరాల సంస్థకు అమ్మేందుకు అక్కడి మార్కెట్‌కు తీసుకెళ్లారు. నెల అవుతున్నా వారి నుంచి ధాన్యం కొనలేదు. జిల్లా మారడంతో రైతుల పేర్లు అనుసంధానం కాలేదని సాగదీశారు. సాయంత్రానికి పట్టాలు కప్పడం, ఉదయాన్నే తీయడం.. నెల రోజులుగా ఇదే పని. ఈ లోగా భారీవర్షాలు కురవడంతో ధాన్యం రాశుల అడుగు భాగం తడిసింది.

నీరు నిలవకుండా బయటకు పంపేందుకు జేసీబీని అద్దెకు తెచ్చి అక్కడే పెట్టుకున్న పరిస్థితి.. పక్కనున్న చాగల్లులోనూ పూర్తి స్థాయిలో ధాన్యం కొనుగోలు చేయలేదు. ఫలితంగా రైతులు ప్రైవేటు వ్యాపారులకు అమ్మేస్తున్నారు.

30%పైగా పొలాల్లో.. రాష్ట్రంలో ఈ ఏడాది 18.55 లక్షల ఎకరాల్లో రబీ పంటగా వరి సాగు చేశారు. ఇప్పటికే కొంతమేర నూర్పిడి పూర్తయింది. ధాన్యం అమ్మకాలు మొదలయ్యాయి. కోత కోయాల్సినది.. కోసి పనలపై ఉన్నదీ... నూర్పిడి చేసి ఆరబెట్టింది కలిపితే.. ఇంకా 30% వరకు ఉంటుందని అంచనా. భారీవర్షాలతో ధాన్యాన్ని తడవకుండా కాపాడుకునేందుకు రైతులు అష్టకష్టాలు పడుతున్నారు.

పరదా పట్టలు అద్దెకు తెచ్చుకోవడం, ఉదయం నుంచి సాయంత్రం వరకు అందుబాటులో ఉండేలా కూలీల ఏర్పాటుతో ఖర్చులు పెరుగుతున్నాయి. ఎకరా వరి సాగుకు రూ.40 వేల వరకు అవుతుండగా.. భారీవర్షంతో సగటున రూ.7 వేల నుంచి రూ.10 వేల వరకు అదనంగా ఖర్చవుతోందనే ఆవేదన రైతుల్లో వ్యక్తమవుతోంది.

51 వేల ఎకరాల్లో ఉద్యాన పంటలకు నష్టం.. తుపానుకు వారం ముందు నుంచీ వీస్తున్న ఈదురుగాలులతో పాటు రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు ఉద్యాన పంటల్ని దెబ్బతీశాయి. ప్రాథమిక అంచనా ప్రకారం 51వేల ఎకరాల్లో పండ్ల తోటలు, కూరగాయ పంటలు (33%పైగా) పాడయ్యాయి.

తుపాను తీవ్ర ప్రభావం చూపిన ఈ రెండు మూడు రోజుల నష్టాన్నీ లెక్కలోకి తీసుకుంటే దెబ్బతిన్న పంటల విస్తీర్ణం 80వేల ఎకరాల పైనే ఉంటుందని అంచనా. ఎకరాకు రూ.50వేల నష్టం లెక్కన చూసినా.. సుమారు రూ.400 కోట్ల వరకు రైతులు కోల్పోయారు. పంట చేతికొచ్చే దశలో విపత్తు విరుచుకు పడిందని రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.