ETV Bharat / city

హనుమాన్ జంక్షన్​ వద్ద లారీ బీభత్సం.. ఒకరు మృతి, నలుగురికి గాయాలు - today road accident at hanuman juction news update

చెన్నై-కోల్​కతా జాతీయ రహదారిపై లారీ కారు, బైక్​ను ఈడ్చుకుంటూ వెళ్లిన ఘటన స్థానికులను భయబ్రాంతులకు గురి చేసింది. కృష్ణా జిల్లాలోని హనుమాన్ జంక్షన్​ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.

lorry hit car in road accident
హనుమాన్ జంక్షన్​ వద్ద కారు ఈడ్చుకెళ్లిన లారీ
author img

By

Published : Jan 15, 2021, 5:58 PM IST

Updated : Jan 15, 2021, 6:57 PM IST

హనుమాన్ జంక్షన్​ వద్ద కారు, బైక్​ను ఈడ్చుకెళ్లిన లారీ

కృష్ణా జిల్లా బాపులపాడు మండలం హనుమాన్ జంక్షన్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చెన్నై-కోల్​కతా జాతీయ రహదారిపై లారీ కారు, బైక్​ను ఈడ్చుకుంటూ వెళ్లింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. మరో నలుగురు కారులో ఇరుక్కున్నారు. ఘటనాస్థలికి చేరుకున్న హనుమాన్ జంక్షన్ పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. లారీ డ్రైవర్ మద్యం సేవించి వాహనాన్ని నడపడమే ప్రమాదానికి కారణమని పోలీసుల ప్రాథమికంగా నిర్ధారించారు. ఈఘటనతో స్థానికులు ఒక్కసారిగా భయబ్రాంతులకు గురైయ్యారు.

ఇవీ చూడండి...

కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ఎలా జరగనుంది?

Last Updated : Jan 15, 2021, 6:57 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.