ETV Bharat / city

'ఎల్జీ పాలిమర్స్ యాజమాన్యానికి జగన్ కొమ్ము కాస్తున్నారు'

విశాఖ గ్యాస్ లీకేజ్ ప్రభావం ఉన్న గ్రామాల్లో అందించాల్సిన వైద్య సహాయంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాలని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​ హితవు పలికారు. గ్యాస్ లీకేజ్ ఘటనలో ప్రభుత్వ అసమర్థత వల్లే ఇప్పుడు ఆ ప్రాంతంలో మరణాలు సంభవిస్తున్నాయన్నారు.

ఎల్జీ పాలిమర్స్ యాజమాన్యానికి జగన్ కొమ్ముకాస్తున్నారు: లోకేశ్

author img

By

Published : Jun 2, 2020, 1:16 PM IST

విశాఖ గ్యాస్ లీకేజ్ ఘటనలో ప్రభుత్వ అసమర్థత వల్లే ఇప్పుడు ఆ ప్రాంతంలో మరణాలు సంభవిస్తున్నాయని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​ ఆరోపించారు. గొప్పకు పోయి బాధితులు కోలుకోకుండానే బలవంతంగా డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపారని మండిపడ్డారు. అందుకే ప్రమాదం జరిగిన 25 రోజుల తరువాత కూడా బాధితులు చనిపోతున్నారని విమర్శించారు. కనకరాజు మృతి ప్రభుత్వ హత్యేనన్న లోకేశ్..., సరైన వైద్యం అంది ఉంటే ఆయనకు ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. బాధితులను గాలికి వదిలి కంపెనీ యాజమాన్యానికి జగన్ కొమ్ము కాస్తున్నారని ఆక్షేపించారు.

ఎల్జీ పాలిమర్స్ గొప్ప కంపెనీ అని ప్రభుత్వం కితాబిస్తుంటే... సంస్థ నిర్లక్ష్యం వల్లే స్టైరీన్ గ్యాస్ లీకైందని ఎన్జీటీ తేల్చిందన్న విషయాన్ని లోకేశ్​ గుర్తు చేశారు. ఇప్పటికైనా గ్యాస్ లీకేజ్ ప్రభావం ఉన్న గ్రామాల్లో అందించాల్సిన వైద్య సహాయంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాలని హితవు పలికారు. గ్యాస్ ప్రభావంతో సుదీర్ఘ కాలం వచ్చే ఆరోగ్య సమస్యలను అంచనా వేసి సహాయ కార్యక్రమాలకు ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేయటంతో పాటు లీకేజ్​కు కారణమైన కంపెనీపై కఠిన చర్యలు తీసుకోవాలని లోకేశ్ డిమాండ్ చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.