కొవిడ్ సమయంలో అత్యవసర సేవలందించేందుకు కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన తీసుకున్న 26,325 మంది ఫ్రంట్ లైన్ వారియర్స్‌కి 6 నెలలుగా జీతాల్లేక తీవ్ర ఆందోళనలో ఉన్నారని, వారికి తక్షణమే బకాయిలు విడుదల చేయాలని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ డిమాండ్ చేశారు. కొవిడ్ వ్యాప్తి తొలిదశ సమయంలోనే వ్యాప్తి నియంత్రణ కోసం ఫ్రంట్ లైన్ వారియర్లుగా వేలాది మందిని ప్రైవేట్ ఏజెన్సీల ద్వారా తీసుకున్నారని పేర్కొన్నారు. కొవిడ్ వచ్చిన వారిని సొంత కుటుంబసభ్యులే దూరం పెట్టిన పరిస్థితుల్లో, ప్రాణాలకు తెగించి కొవిడ్ బాధితులకు వైద్యం చేసి ప్రాణాలు కాపాడిన ఫ్రంట్‌లైన్ వారియర్స్‌ని పట్టించుకోకపోవడం విచారకరమన్నారు. సెలవుల్లేవు, పండగలు-పబ్బాలైనా విధుల్లో వున్న కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఆరు నెలలుగా వేతనాలు చెల్లించకపోవడం ముమ్మాటికీ ప్రభుత్వ నిర్లక్ష్యమేనని లోకేశ్ ఆరోపించారు.
ప్రజల ప్రాణాలు కాపాడటానికి వేలకోట్ల అప్పులు చేయాల్సి వచ్చిందని పదేపదే చెబుతోన్న ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి 26,325 మంది ఫ్రంట్ లైన్ వారియర్స్‌కి 6 నెలలుగా జీతాలివ్వలేదని, చేసిన అప్పులు ఎవరి జేబుల్లోకి వెళ్లాయో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కొవిడ్ మహమ్మారి సమయంలో సేవలు అందించేవారికి.. భవిష్యత్తులో ప్రభుత్వ ఉద్యోగాలలో కొన్ని గ్రేస్ మార్కులు ఇస్తామని ఆశపెట్టడంతో చాలా మంది ఇప్పుడు ప్రాణాలకు తెగించి కష్టపడితే భవిష్యత్తులో ప్రభుత్వ ఉద్యోగాలు పొందొచ్చని కొందరు, తమని రెగ్యులర్ చేస్తారనే ఆశతో మరికొందరు ..జీతాలు ఇవ్వకపోయినా పనిచేస్తూనే వున్నారని పేర్కొన్నారు.
-
జీతాలందక ఫ్రంట్ లైన్ వారియర్స్
— Lokesh Nara (@naralokesh) August 11, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
జీవితాలు అగమ్యగోచరంగా మారాయి. కోవిడ్ వచ్చిన వారిని సొంత కుటుంబసభ్యులే దూరం పెట్టిన పరిస్థితుల్లో, ప్రాణాలకు తెగించి కోవిడ్ బాధితులకు వైద్యం చేసి ప్రాణాలు కాపాడిన ఫ్రంట్‌లైన్ వారియర్స్‌ని పట్టించుకోకపోవడం విచారకరం.(1/5)
">జీతాలందక ఫ్రంట్ లైన్ వారియర్స్
— Lokesh Nara (@naralokesh) August 11, 2021
జీవితాలు అగమ్యగోచరంగా మారాయి. కోవిడ్ వచ్చిన వారిని సొంత కుటుంబసభ్యులే దూరం పెట్టిన పరిస్థితుల్లో, ప్రాణాలకు తెగించి కోవిడ్ బాధితులకు వైద్యం చేసి ప్రాణాలు కాపాడిన ఫ్రంట్‌లైన్ వారియర్స్‌ని పట్టించుకోకపోవడం విచారకరం.(1/5)జీతాలందక ఫ్రంట్ లైన్ వారియర్స్
— Lokesh Nara (@naralokesh) August 11, 2021
జీవితాలు అగమ్యగోచరంగా మారాయి. కోవిడ్ వచ్చిన వారిని సొంత కుటుంబసభ్యులే దూరం పెట్టిన పరిస్థితుల్లో, ప్రాణాలకు తెగించి కోవిడ్ బాధితులకు వైద్యం చేసి ప్రాణాలు కాపాడిన ఫ్రంట్‌లైన్ వారియర్స్‌ని పట్టించుకోకపోవడం విచారకరం.(1/5)
ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా విధుల్లో చేరినవారు కొవిడ్ టెస్టులు చేయటం.. కొవిడ్ కేర్, క్వారంటైన్ సెంటర్లు, కొవిడ్ ఆసుపత్రుల్లో పని చేస్తున్నారు. ఏఎన్‌ఎం, స్టాఫ్ నర్సులు, ట్రైనీ నర్సులు, ఎనస్తీషియా టెక్నీషియన్లు, నాన్‌మెడికల్ రీసెర్చ్ సైంటిస్టులు, జీడీఎంఓ, స్పెషలిస్టులు, ఎమ్‌ఎన్‌వో ఇలా వివిధ స్థాయిల్లో సిబ్బందిని నియమించుకున్న ప్రభుత్వం వారికి జీతాలిచ్చే బాధ్యతలు ఏజెన్సీలకు అప్పగించిందని, వారు ఆరు నెలలుగా బడ్జెట్ లేదంటూ జీతాలు ఇవ్వడంలేదని మండిపడ్డారు.
కరోనా ఫస్ట్ వేవ్ సమయంలో ఇలా పనిచేసిన కరోనా వారియర్స్ కి జీతాలు పెండింగ్‌లో వుంటుండగానే వేలాది మందిని తొలగించారని, ఇప్పుడు పనిచేస్తున్న వేలాది మందికి మళ్లీ జీతాలు బకాయిలు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వేలల్లో జీతం వున్న ఫ్రంట్‌లైన్ వారియర్లకు ఆరునెలలుగా జీతాలు పెండింగ్‌లో పెట్టిన జగన్ ప్రభుత్వం నెలకు లక్షల్లో తీసుకుంటున్న సలహాదారులకు ఒక్కరికైనా బకాయి పెట్టిందా అని నిలదీశారు. సొంత కాంట్రాక్టర్లకు వేలకోట్లు బిల్లులు చెల్లించడానికి వున్న ఖజానా, కొవిడ్ ఫ్రంట్‌లైన్ వారియర్ల జీతాలివ్వడానికి ఖాళీ అయ్యిందా అని ప్రశ్నించారు. తక్షణమే కొవిడ్ నియంత్రణకు ప్రాణాలు పణంగా పెట్టి పనిచేస్తోన్న ఫ్రంట్‌లైన్ వారియర్స్‌కి బకాయి పడిన జీతాలు చెల్లించాలని, ఉద్యోగభద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: