ETV Bharat / city

టీచ‌ర్లపై క‌క్ష - విద్యార్థుల‌కు శిక్ష.. ఇది వైకాపా ప్రభుత్వ విద్యావిధానం: లోకేశ్‌ - latest news in ap

LOKESH ON EDUCATION SYSYTEM : టీచ‌ర్లపై క‌క్ష-విద్యార్థుల‌కు శిక్ష.. ఇది వైకాపా ప్రభుత్వ విద్యావిధానం అని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ విమర్శించారు. 117, 128, 84, 85జీవోల‌తో విద్యావ్యవ‌స్థ అస్తవ్యస్తంగా మారిందని దుయ్యబట్టారు. ఈ జీవోలతో ఉపాధ్యాయులు గంద‌ర‌గోళంలో ఉంటే..విద్యార్థులు ఆందోళ‌న‌లో ఉన్నారని మండిపడ్డారు. దీనిపై ప్రశ్నిస్తే ప్రభుత్వం ఎదురుదాడి చేస్తోందని విమర్శించారు. విద్యావ్యవ‌స్థకు శాపంగా మారిన జీవోల‌ను ఇప్పటికైనా ర‌ద్దుచేయాలని డిమాండ్​ చేశారు.

lokesh
lokesh
author img

By

Published : Jul 28, 2022, 12:35 PM IST

LOKESH ON EDUCATION SYSYTEM : విద్యాసంస్కర‌ణ‌ల పేరుతో వైకాపా ప్రభుత్వం​ అమ‌లు చేస్తోన్న 117 జీవో టీచ‌ర్లపై క‌క్ష సాధించేలా ఉంద‌ని.. విద్యార్థుల‌కు శిక్షగా మారింద‌ని తెదేపా జాతీయ ప్రధాన కార్యద‌ర్శి నారా లోకేశ్​ ఆగ్రహం వ్యక్తం చేశారు. జాతీయ విద్యా విధానం అమలు పేరుతో ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ, పాఠశాలల విలీనం కోసం స‌ర్కారు జారీచేసిన జీవో 117, 128, 84, 85ల‌తో విద్యావ్య‌వ‌స్థ అస్తవ్యస్తంగా మారింద‌ని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాణ్యమైన విద్యలో 3వ స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ మూడేళ్ల జ‌గ‌న్‌రెడ్డి పాల‌న‌లో 19వ స్థానానికి ప‌డిపోవ‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంద‌న్నారు. పాఠ‌శాల‌ల విలీనంతో నిరుపేద పిల్లలు విద్యకి పూర్తిగా దూర‌మై.. బాల‌కార్మికులుగా మారే ప్రమాదం ఉంద‌న్నారు.

నూత‌న విద్యావిధానాన్ని.. ఉపాధ్యాయుల‌పై క‌క్ష సాధించేందుకు జగన్​ ప్రభుత్వం వాడుతోందని లోకేశ్‌ దుయ్యబట్టారు. వారానికి 24 నుంచి 30 పీరియడ్లు మాత్రమే చెప్పగ‌లిగిన ఉపాధ్యాయులు.. వైకాపా తెచ్చిన జీవో ప్రకారం వారానికి 40 నుంచి 48 పీరియడ్లు ప‌నిచేయాల్సిన దుస్థితి ఏర్పడింద‌ని మండిపడ్డారు. త‌ల‌కు మించిన భారంగా పనిగంటలు పెంచి.. పైపెచ్చు 8 గంట‌లైనా ఉపాధ్యాయులు స్కూల్‌లో ప‌నిచేయ‌లేరా అని విద్యాశాఖా మంత్రి బొత్స స‌త్యనారాయ‌ణ ఉపాధ్యాయులను వెట‌క‌రించ‌డం ముమ్మాటికీ వేధింపుల్లో భాగ‌మేన‌ని విమర్శించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే హ‌క్కు లేదంటూ టీచ‌ర్లని బెదిరించేలా మంత్రి మాట్లాడ‌టం ప్రభుత్వం నిరంకుశ తీరుకి అద్దం ప‌డుతోంద‌న్నారు.

విద్యార్థులు, ఉపాధ్యాయులు, మేధావులు వ‌ద్దంటున్నా..ఉద్యమిస్తున్నా మొండిగా వెళ్తోన్న స‌ర్కారు తీరుతో విద్యావ్యవ‌స్థ కోలుకోలేని విధంగా దెబ్బతింటోంద‌ని ఆవేద‌న వ్యక్తం చేశారు. 117, 128, 84, 85జీవోలు వెన‌క్కి తీసుకోవాల‌ని ఉద్యమిస్తున్న ఉపాధ్యాయ సంఘాల‌కు తెలుగుదేశం పార్టీ సంపూర్ణ మ‌ద్దతు తెలియ‌జేస్తోంద‌న్నారు. విద్యావ్యవ‌స్థని నాశ‌నం చేసే ఈ జీవోల‌ని ర‌ద్దు చేయాల‌ని డిమాండ్ చేశారు. సంస్కర‌ణ‌లు అమ‌లు చేయాల‌నే చిత్తశుద్ధి ఉంటే విద్యార్థులు, త‌ల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సంఘాలు, విద్యావేత్తలు స‌ల‌హాలు తీసుకుని ముందుకు వెళ్లాల‌ని లోకేశ్‌ సూచించారు.

  • పాఠ‌శాల‌ల విలీనంతో నిరుపేద పిల్ల‌లు విద్య‌కి పూర్తిగా దూర‌మై బాల‌కార్మికులుగా మారే ప్ర‌మాదం ఉంది. సీపీఎస్ ర‌ద్దు, త‌మ‌కు రావాల్సిన ప్ర‌యోజ‌నాల కోసం పోరాడిన ఉపాధ్యాయుల‌పై క‌క్ష సాధించేందుకు నూత‌న విద్యావిధానాన్ని జ‌గ‌న్‌రెడ్డి స‌ర్కారు ఒక ఆయుధంగా వాడుతుంది.(2/4)

    — Lokesh Nara (@naralokesh) July 28, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.