ముఖ్యమంత్రి జగన్ ఐటీ సమీక్షకు హాజరైన సలహాదారులన్ని సంస్థలైనా...రాష్ట్రానికి రాలేదని తెలుగుదేశం నేత నారా లోకేశ్ దుయ్యబట్టారు. డజన్ల కొద్దీ సలహాదారులను నియమించుకుంటున్నారే తప్ప...రాష్ట్రానికి పెట్టుబడి పెట్టే ఒక్క సంస్థ కూడా తీసుకురావడం లేదన్నారు. తెలుగుదేశం హయాంలో వచ్చిన సంస్థలన్నీ ఐటీశాఖ మంత్రి తన ఖాతాలో వేసుకునే పనిలో ఉన్నారని ఎద్దేవా చేశారు.
-
ఐటీ శాఖ పై @ysjagan గారు నిర్వహించిన సమీక్షా సమావేశానికి సంబంధించిన ఫోటోలు ఆ శాఖ దుస్థితిని తెలియజేస్తున్నాయి. విగ్రహం పుష్టి, నైవేద్యం నష్టి అన్నట్టు తయారైంది ఏపీ ఐటీ శాఖ పరిస్థితి. డజన్ల కొద్దీ సలహాదారుల్ని పెంచుకుంటూ పోతున్నా రాష్ట్రానికి వచ్చిన కంపెనీలు శూన్యం.(1/3) pic.twitter.com/smiB1IBkKa
— Lokesh Nara (@naralokesh) August 3, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">ఐటీ శాఖ పై @ysjagan గారు నిర్వహించిన సమీక్షా సమావేశానికి సంబంధించిన ఫోటోలు ఆ శాఖ దుస్థితిని తెలియజేస్తున్నాయి. విగ్రహం పుష్టి, నైవేద్యం నష్టి అన్నట్టు తయారైంది ఏపీ ఐటీ శాఖ పరిస్థితి. డజన్ల కొద్దీ సలహాదారుల్ని పెంచుకుంటూ పోతున్నా రాష్ట్రానికి వచ్చిన కంపెనీలు శూన్యం.(1/3) pic.twitter.com/smiB1IBkKa
— Lokesh Nara (@naralokesh) August 3, 2021ఐటీ శాఖ పై @ysjagan గారు నిర్వహించిన సమీక్షా సమావేశానికి సంబంధించిన ఫోటోలు ఆ శాఖ దుస్థితిని తెలియజేస్తున్నాయి. విగ్రహం పుష్టి, నైవేద్యం నష్టి అన్నట్టు తయారైంది ఏపీ ఐటీ శాఖ పరిస్థితి. డజన్ల కొద్దీ సలహాదారుల్ని పెంచుకుంటూ పోతున్నా రాష్ట్రానికి వచ్చిన కంపెనీలు శూన్యం.(1/3) pic.twitter.com/smiB1IBkKa
— Lokesh Nara (@naralokesh) August 3, 2021
రాష్ట్రంలో కొత్త సంస్థలు రాకపోగా..ఉన్నవి వీడిపోయే పరిస్థితులు తెచ్చారని మండిపడ్డారు. టీ, కాఫీలు తాగుతూ కాలక్షేపం చేస్తున్నారని ఆక్షేపించారు. సలహాదారుల్లో కొంతమందికి ఇతర రాష్ట్రాల్లో ఐటీ కంపెనీలు ఉన్నా.. సీఎం జగన్ ముఖం చూసి రాష్ట్రంలో కంపెనీ ఏర్పాటుకు ముందుకు రాకపోవడం కొసమెరుపని ట్వీటర్ వేదికగా లోకేశ్ ఎద్దేవా చేశారు.
ఇదీ చదవండి
CM Jagan: మొదటి విడతలో 4,530 డిజిటల్ లైబ్రరీల నిర్మాణం: సీఎం జగన్