రాష్ట్రంలో పెట్రోలు ,డీజిల్పై వ్యాట్ టాక్స్ తగ్గించాలని సీఎం వైఎస్ జగన్ను లారీ యజమానులు కోరారు. ఈ మేరకు ముఖ్యమంత్రికి ఎపీ లారీ ఒనర్స్ అసోసియేషన్ లేఖ రాసింది. కేంద్రం కొంత మేర పెట్రోల్ ,డీజిల్ రేట్లను తగ్గించినందున రాష్ట్ర ప్రభుత్వం కూడా రేట్లు తగ్గించాలని లారీ యజమానులు కోరారు. రాష్ట్రంలో డీజిల్ పై వ్యాట్ టాక్స్ ను 22.25 నుంచి 17శాతానికి తగ్గించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే పెట్రోల్ పై విధిస్తోన్న వ్యాట్ టాక్స్ ను 33నుంచి 28 శాతానికి తగ్గించాలని లేఖలో పేర్కొన్నారు. ప్రస్తుతం పొరుగు రాష్ట్రాల కంటే ఏపీలో ఎక్కువ రేట్లు ఉన్నాయని ..వీటిని ఇతర రాష్ట్రాల కంటే తగ్గిస్తే ఎక్కువ ప్రయోజనం ఉంటుందని తెలిపారు.
ఇదీ చదవండి: TDP: కర్ణాటకలో అలా.. ఏపీలో ఇలా.. ఇది జగన్ కక్ష సాధింపు కాదా? : తెదేపా