ETV Bharat / city

సీఎం జగన్​కు వామపక్షాలు లేఖ - సీపీఐ వార్తలు

ముఖ్యమంత్రి జగన్​కు వాపపక్ష పార్టీలు లేఖ రాశాయి. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణను ఉపసంహరించుకోవాలని అసెంబ్లీలో తీర్మానం ఆమోదించి కేంద్రానికి పంపాలని లేఖలో పేర్కొన్నారు. కరోనాతో ఉపాధి కోల్పోయిన శ్రామిక కుటుంబాలకు నెలకు రూ.7,500 చొప్పున భృతి చెల్లించడంతోపాటు పేద, మధ్యతరగతి కుటుంబాల ప్రజలకు కేరళ తరహాలో ఆహార కిట్లు అందించాలని కోరారు.

left parties
వాపపక్ష పార్టీలు
author img

By

Published : May 19, 2021, 9:58 PM IST

రాష్ట్రంలోని వామపక్ష పార్టీలు ముఖ్యమంత్రి జగన్​కు లేఖ రాశాయి. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన విశాఖపట్నం ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ చర్యను ఉపసంహరించుకోవాలని కోరుతూ రేపటి అసెంబ్లీ సమావేశంలో తీర్మానం ఆమోదించి కేంద్రానికి నివేదించాలని వామపక్ష పార్టీలు విజ్ఞప్తి చేశాయి. ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ కింది కరోనా రోగులకు ఉచిత చికిత్స అందించేందుకు తగు చర్యలు చేపట్టాలని కోరారు. స్థానిక సంస్థలను భాగస్వాములు చేసి మండల, పట్టణ, గ్రామ స్థాయిలో ఐసోలేషన్ /క్వారంటైన్ సెంటర్స్ ప్రభుత్వం ప్రారంభించాలని సూచించారు. ఉపాధి కోల్పోయిన శ్రామిక కుటుంబాలకు నెలకు రూ.7,500 చొప్పున భృతి చెల్లించడంతోపాటు పేద, మధ్యతరగతి కుటుంబాల ప్రజలకు కేరళ తరహాలో ఆహార కిట్లు అందించాలని కోరారు.

కొవిడ్ ఆసుపత్రుల్లో సరిపడేంత ఆక్సిజన్ నిల్వలు ఉండేలా చర్యలు చేపట్టాలని విపక్షాలు సూచించాయి. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై అన్ని పార్టీలు, నిపుణుల సలహాలు తీసుకొనే విధంగా అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని లేఖలో పేర్కొన్నారు. కరోనాతో మరణించే మృతులకు నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో కరోనా అవగాహనా సదస్సులు నిర్వహించాలని సూచించారు.

ఇదీ చదవండి

2020 - 21 ఆర్థిక సర్వే ప్రతిని విడుదల చేసిన సీఎం జగన్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.