ETV Bharat / city

మెడికల్ కౌన్సెలింగ్​లో గందరగోళం

మెడికల్ విద్యార్థులకు రీ కౌన్సెలింగ్ బీసీ సంఘాల నేతలు డిమాండ్ చేశారు. అధికారుల తప్పిదంతో 187 సీట్లను రిజర్వేషన్ వర్గాలు నష్టపోయాయని ఆరోపించారు.

మెడికల్
author img

By

Published : Jul 20, 2019, 11:13 PM IST

రిజిస్ట్రార్​తో లక్ష్మీనరసింహ యాదవ్ చర్చ

మెడికల్ కౌన్సెలింగ్​లో బీసీ విద్యార్థులకు అన్యాయం జరిగిందని ఆ సామాజిక వర్గానికి చెందిన సంఘాల నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 550 జీవో అమలు చేయాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను అధికారులు ఉల్లంఘించారని ఆరోపించారు. సీట్ల భర్తీ ప్రక్రియకు సంబంధించి విధి విధానాలను వెల్లడించకపోవటం వల్ల బీసీ విద్యార్థులు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థి యువజన సమాఖ్య జాతీయ అధ్యక్షుడు లక్ష్మీ నరసింహయాదవ్ నేతృత్వంలోని బృందం విజయవాడలోని ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ అప్పలనాయుడుతో సమావేశమైంది. అధికారుల తప్పిదంతో మొత్తం 187 సీట్లను రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులు నష్టపోయారని వివరించారు. విద్యార్థులకు అన్యాయం చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని బీసీ సంఘాల నేతలు డిమాండ్ చేశారు. కౌన్సెలింగ్ ప్రక్రియను నిలిపివేసి రీకౌన్సెలింగ్ నిర్వహించి విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఉపకులపతితో చర్చించి విద్యార్థులకు న్యాయం జరిగేటట్లు చూస్తామని రిజిస్ట్రార్ హామీ ఇచ్చారు.

Intro:ap_gnt_46_20_nadilo_duki_aatmahatya_avb_ap10035

గుంటూరు జిల్లా రేపల్లె మండలం పెనుముడి వారధి పై నుంచి ఓ వ్యక్తి కృష్ణ నదిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. చేరుకుపల్లి మండలంలోని ఎస్టీ కాలనికి చెందిన కట్ట కిరణ (27) శుక్రవారం రాత్రి సుమారు 11 గంటల సమయంలో నదిలోకి దుకాడు .అతనితో పాటు ఉన్న బంధువులు ఘటన పై పోలీసులకు ఫిర్యాదు చేశారు.దీనితో తెల్లవారు జాము నుంచి పోలీసులు గజ ఈతగాళ్ళ తో గాలింపు చర్యలు చేపట్టారు.ఈరోజు సాయంత్రం సుమారు 3 గంటల సమయంలో మృతదేహన్నీ వెలికి తీసిసారు.అయితే భార్య ,భర్త ల మధ్య మనస్పర్ధల వల్లనే మనస్తాపానికి గురై ఆత్మహత్య కు పాల్పడినట్లు ప్రాధమిక విచారణగా పోలీసులు తెలుపుతున్నారు.ఘటన పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చరణ్ తెలిపారు.

Body:బైట్..చరణ్ (రేపల్లె పట్టణ ఎస్సై)

Conclusion:etv contribute r
sk.meera saheb ..7075757517
repalle, guntur jilla
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.