న్యాయవాదులకు కేటాయించిన నిధులను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ... విజయవాడలో న్యాయవాదులు చేపట్టిన నిరసనలు 4వ రోజుకు చేరాయి. కరోనా ప్రభావంతో కోర్టులు మూతబడి న్యాయవాద వృత్తిని జీవనాధారంగా చేసుకుని జీవిస్తున్న వారి పరిస్థితి దుర్భరంగా ఉందని బార్ అసోసియేషన్ సభ్యులు రాంప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రతి న్యాయవాదికి రెండు లక్షల ఆర్ధిక సాయం చేసి ఆదుకోవాలని న్యాయవాది రాధకుమారి కోరారు. బార్ కౌన్సిల్ సభ్యులు చొరవ తీసుకుని ప్రభుత్వంతో చర్చలు జరిపి 100 కోట్ల నిధులు విడుదల అయ్యేలా కృషి చేయాలని కోరారు. 35 సంవత్సరాల తరువాత న్యాయవాద వృత్తిలోకి వచ్చినవారిని కూడా సంక్షేమ పథకాలు పరిధిలోకి తీసుకుని అందరికి ఆరోగ్య కార్డులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.