గడచిన 24 గంటల్లో రాష్ట్రంలో 326 కరోనా కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ తెలిపింది. వీటితో కలిపి రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 8 లక్షల 82 వేల 612కు చేరింది. వైరస్ కారణంగా ఇవాళ ఒక్క మరణం కూడా నమోదు కాలేదు. కాగా..ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 7,108 గా ఉంది. గడిచిన 24 గంటల వ్యవధిలో 350 మంది కరోనా నుంచి కోలుకున్నట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. దీంతో రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 8.72కు చేరుకుంది. ఇవాళ 58, 519 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా...మెుత్తం పరీక్షలు కోటీ 18 లక్షలు దాటినట్లు వైద్యారోగ్యశాఖ అధికారులు స్పష్టం చేశారు.
ఇదీచదవండి