BIKE RALLY: అల్లురి సీతారామరాజు 125 జయంతి ఉత్సవాల సందర్భంగా.. క్షత్రియ యువజన సంఘం ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. విజయవాడ సీతారాంపురం నుంచి అజిత్ సింగ్ నగర్ అల్లూరి సీతారామరాజు వంతెన వరకు.. ఈ ర్యాలీ కొనసాగింది. ప్రధాని మోదీ చేతులమీదుగా భీమవరంలో ప్రారంభించనున్న అల్లూరి విగ్రహ ప్రారంభోత్సవానికి సంఘీభావంగా.. ర్యాలీ చేపట్టారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుకు జాతీయ స్థాయిలో గుర్తింపు తెస్తూ.. ప్రధాని విగ్రహ ఆవిష్కరణకుకు రావడం ఆనందంగా ఉందని క్షత్రియ యువజన సంఘం నాయకులు అన్నారు.
ఇవీ చదవండి: