ETV Bharat / city

ఉభయతారకంగా కృష్ణా జలాలు.... సయోధ్యతోనే సత్ఫలితాలు

శ్రీశైలంనుంచి రోజూ మూడు శతకోటి ఘనపుటడుగుల (టీఎంసీల) నీటిని మళ్లించేలా ఆంధ్రప్రదేశ్‌ కొత్తగా ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టటంతో కృష్ణా జలాల వినియోగంపై- వివాదం, వాదనలు మొదలయ్యాయి. ఈ పథకాన్ని చేపట్టటంతో పాటు పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌ ద్వారా నీటిని మళ్లించే కాలువ సామర్థ్యాన్ని 44వేల క్యూసెక్కుల నుంచి 80వేల క్యూసెక్కులకు విస్తరించడాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు ఫిర్యాదు చేసింది. దీనికి ప్రతిగా తెలంగాణలో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులపై ఆంధ్రప్రదేశ్‌ ఫిర్యాదు చేయడం, కేంద్రం సైతం జోక్యం చేసుకోవడంతో శ్రీశైలం ప్రాజెక్టు కేంద్రంగా చర్చలు ప్రారంభమయ్యాయి.

ఉభయతారకంగా కృష్ణాజలాలు !
ఉభయతారకంగా కృష్ణాజలాలు !
author img

By

Published : Jun 4, 2020, 9:07 AM IST

రెండు తెలుగు రాష్ట్రాలకు శ్రీశైలం కీలకమైన ప్రాజెక్టు. సాగు, తాగునీటి అవసరాలకు ఈ ప్రాజెక్టు నుంచే 400 టీఎంసీలు తీసుకోవడంతోపాటు 45 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించాల్సి ఉంటుంది. అత్యంత ప్రాధాన్యం కలిగిన ఈ ప్రాజెక్టు విషయంలో రెండు రాష్ట్రాలు పరస్పర సహకారం, అవగాహనతో ముందడుగు వేయాల్సిన అవసరం ఉంది. ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేయడం ఒక ఎత్తయితే, పూర్తయిన ప్రాజెక్టులకు నీటిలభ్యత ఉండటం మరో ఎత్తు. ఈ ప్రాజెక్టు నుంచి ఎంత నీటిని వినియోగించుకోవడానికి అవకాశం ఉంటుంది, ఈ నీటిలో ఎవరి వాటా ఎంత, ఉన్న వాటాను ఎలా వినియోగించుకోవాలి, అవసరాలకు తగ్గట్లుగా శ్రీశైలంలో నీటి లభ్యత లేకుంటే ఏం చేయాలన్నదానిపై చర్చించుకొని ఓ అంగీకారానికి రావలసి ఉంది. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల పరిధిలోని ఆయకట్టును పూర్తిగా సాగులోకి తేవడానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉంది.

ఉమ్మడి వ్యూహం అవసరం
శ్రీశైలంపై ఆధారపడిన ప్రాజెక్టుల సాగు, తాగు నీటి అవసరాలకు రోజూ లక్షా 30వేల క్యూసెక్కుల నీటిని మళ్లించాల్సి ఉంటుంది. ఇప్పటికే వినియోగంలో ఉన్న, నిర్మాణం జరుగుతున్న, విస్తరణ, ప్రతిపాదనలో ఉన్న ప్రాజెక్టులన్నింటికీ కలిపి ఆ మేరకు నీరు అవసరం. ఇందులో ఇప్పటికే నీటిని తీసుకొనే పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌, హంద్రీనీవా, కల్వకుర్తితోపాటు నిర్మాణంలో ఉన్న పాలమూరు-రంగారెడ్డి, శ్రీశెలం ఎడమగట్టు కాలువ, దిండి ఎత్తిపోతల, వెలిగొండ ఉన్నాయి. దానితోపాటు తాజాగా పోతిరెడ్డిపాడు ద్వారా 44వేల క్యూసెక్కుల నుంచి 80వేల క్యూసెక్కుల మేర నీటిని మళ్లించేందుకు (ప్రతిపాదిత) ఉదేశించిన శ్రీశైలం కుడి ప్రధాన కాలువ కూడా ఉంది. వరద ప్రవాహం ఉన్నప్పుడు ఈ ప్రాజెక్టులకు నీటిని తీసుకోవడానికి ఎలాంటి సమస్యా ఉండదు. వరద లేనప్పుడు, కేవలం శ్రీశైలంలో ఉన్న నిల్వలనే వినియోగించుకోవాల్సి వచ్చినపుడు సమస్యలు ఉత్పన్నం అవుతాయి.

శ్రీశైలం మీద ఆధారపడిన ప్రాజెక్టులకు నీటిని వదలడమే కాదు- నాగార్జునసాగర్‌, కృష్ణాడెల్టా అవసరాలకు కనీసం 180 శతకోటి ఘనపుటడుగులను విద్యుదుత్పత్తి ద్వారా దిగువకు వదలాల్సి ఉంటుంది. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకొన్నప్పుడు శ్రీశైలం ప్రాజెక్టు మీద ఒత్తిడి పెరుగుతుంది. ఈ ప్రాజెక్టుపై ఒత్తిడి పెరగడం అంటే రెండు రాష్ట్రాల మీద ఒత్తిడి ఉన్నట్లే! మరో వైపు శ్రీశైలం సామర్థ్యం 267 టీఎంసీల నుంచి 215 టీఎంసీలకు పడిపోయింది. ఈ ప్రాజెక్టులో కనీస నీటిమట్టం 834 అడుగుల దిగువన 54 టీఎంసీలు ఉంటుంది. దీనికి పైన ఉన్న 161 టీఎంసీలు శ్రీశైలం మీద ఆధారపడిన ప్రాజెక్టులకు రెండువారాలకు సరిపోతాయి. విద్యుదుత్పత్తి ద్వారా నాగార్జునసాగర్‌ ఆయకట్టు అవసరాలు తీర్చాల్చి ఉంటుంది. తాగునీటికి జూన్‌ వరకు నిల్వ ఉంచుకోవాల్సి ఉంటుంది. వీటన్నిటిని పరిగణనలోకి తీసుకొని రెండు రాష్ట్రాలూ కలిసి ఓ విధానాన్ని రూపొందించుకోవాల్సిన అవసరం ఉంది. బచావత్‌ ట్రైబ్యునల్‌ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు 811 టీఎంసీలు కేటాయిస్తే, ఇందులో ఆంధ్రప్రదేశ్‌ 512 టీఎంసీలు, తెలంగాణ 299 టీఎంసీలు ప్రస్తుతం వినియోగించుకొంటున్నాయి. బ్రిజేష్‌కుమార్‌ ట్రైబ్యునల్‌ 2013లో ఇచ్చిన తీర్పు అమలులోకి వస్తే ఎగువన ఉన్న మహారాష్ట్ర, కర్ణాటకలు మరో 254 టీఎంసీలు ఎక్కువగా వాడుకొనే అవకాశం ఉంది. బచావత్‌ ట్రైబ్యునల్‌ కేటాయింపులను కాపాడటానికి సరిహద్దులో 442 టీఎంసీలు వచ్చేలా చూడాలి. మిగిలిన 369 టీఎంసీలు రెండు తెలుగు రాష్ట్రాల్లో అందుబాటులోకి వస్తాయని అంచనా. కానీ గడచిన కొన్ని సంవత్సరాలుగా నీటి లభ్యతను లెక్కలోకి తీసుకొంటే కృష్ణాలో తెలుగు రాష్ట్రాల్లో నీటి లభ్యత తగ్గిపోయింది. కాబట్టి కర్ణాటక ఆలమట్టి నుంచి, భీమా నుంచి, తుంగభద్ర నుంచి విడుదల చేసే నీటిపైనే రెండు తెలుగు రాష్ట్రాలూ ఎక్కువగా ఆధారపడాల్సి ఉంటుంది.

కృష్ణాలో ఉన్న కేటాయింపులో ఎవరికి ఎంత అన్నదానిపైన ప్రస్తుతం బ్రిజేష్‌కుమార్‌ ట్రైబ్యునల్‌ విచారణ జరుపుతోంది. ఈ తీర్పు వస్తే ఎవరి వాటా ఎంత, ఏ ప్రాజెక్టుకు ఎంత కేటాయింపు ఉంటుందో స్పష్టమవుతుంది. బ్రిజేష్‌కుమార్‌ ట్రైబ్యునల్‌ తీర్పును కేంద్రం ‘నోటిఫై’ చేస్తే దాన్ని అమలు జరిగేలా చూసేందుకు ప్రత్యేకంగా ఓ బోర్డు ఏర్పాటవుతుంది. మొదట బచావత్‌ ట్రైబ్యునల్‌ 75 శాతం నీటి లభ్యత ఆధారంగా చేపట్టిన ప్రాజెక్టులు, తరవాత బ్రిజేష్‌కుమార్‌ ట్రైబ్యునల్‌ తీర్పు ప్రకారం 65 శాతం నీటి లభ్యత కేటాయింపులు, సరాసరి నీటి లభ్యత కేటాయింపుల ప్రకారం వినియోగం జరుగుతుంది. ఇది అమలులోకి వచ్చి, ప్రస్తుతం శ్రీశైలం ఆధారంగా రెండు రాష్ట్రాలు చేపట్టిన ప్రాజెక్టులన్నీ పూర్తయితే మరిన్ని సమస్యలు వస్తాయి. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకొని దీర్ఘకాలంలో ఎలాంటి సమస్యలూ ఉత్పన్నం కాకుండా ఉండటానికి ఏం చేయాలన్నదానిపై రెండు రాష్ట్రాలూ కలిసి వ్యూహం రూపొందించుకోవాల్సిన అవసరం ఉంది.

ప్రత్యామ్నాయాలు అన్వేషించాలి
కృష్ణాలో ఉన్న అవసరాలు, నీటి లభ్యతను పరిగణనలోకి తీసుకొని గోదావరి నుంచి వరద నీటిని మళ్లించడంపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రులు రెండు దఫాలు చర్చించారు. వీరి సూచన మేరకు రోజుకు రెండు నుంచి నాలుగు టీఎంసీల వరకు గోదావరి నుంచి వరద నీటిని శ్రీశైలానికి మళ్లించడంపై రెండు రాష్ట్రాల ఇంజినీర్లు ప్రతిపాదనలు తయారు చేశారు. కానీ ఆ దిశగా ముందడుగు పడలేదు. ఇరు రాష్ట్రాలు సంయుక్తంగా చేపట్టినా లేదా వేర్వేరుగా ఆయా రాష్ట్రాలు నీటిని మళ్లించినా, ఇలా మళ్లించిన నీటిని ఎలా వినియోగించుకోవాలన్నదానిపై ఓ అవగాహనకు రావాల్సిన అవసరం ఉంది. గడచిన కొన్ని సంవత్సరాలుగా ప్రత్యేకించి ఆలమట్టి నిర్మాణం అనంతరం జులై ఆఖరు వరకు శ్రీశైలంలోకి నామమాత్రంగానే నీరొస్తోంది. ఆగస్టు మొదటి వారానికి గానీ శ్రీశైలంలో మట్టం పెరగడం లేదు. గోదావరిలో జూన్‌ రెండో వారం నుంచి వరద నీరు అందుబాటులో ఉంటుంది కాబట్టి- జులై ఆఖరు లేదా ఆగస్టు రెండో వారం వరకు నీటిని మళ్లించి వినియోగించుకోవచ్చు. ఆ సమయంలో శ్రీశైలంలో తక్కువ మట్టంలో నీటి నిల్వ ఉండి గోదావరి నుంచి మళ్లించిన నీటిని రెండు రాష్ట్రాలు ఏయే ప్రాజెక్టుకు ఎంత నీటిని తీసుకోవాలో ముందుగానే నిర్ణయించుకోవాలి. ఇలా నిర్ణయించిన నీటిని తీసుకోవడానికి ప్రస్తుతమున్న ఏర్పాటు సరిపోకపోతే ప్రత్యామ్నాయాలను అన్వేషించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే శ్రీశైలం కనీస నీటిమట్టం దిగువ నుంచి నీటిని తీసుకొనే అవకాశం ప్రస్తుతం హంద్రీనీవా, కల్వకుర్తి, పాలమూరు-రంగారెడ్డి, శ్రీశైలం ఎడమగట్టు సొరంగం ప్రాజెక్టులకు మాత్రమే ఉంది. ఇలాంటి అంశాలన్నింటిపైనా రెండు రాష్ట్రాలు కలిసి చర్చించుకొని వివాదాలకు తావు లేకుండా ముందడుగు వేయడమే శ్రేయస్కరం - ఎం.ఎల్‌.ఎన్‌.రెడ్డి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.