కేటాయించిన దానికంటే ఎక్కువ జలాలను వాడుకున్నందున నాగార్జునసాగర్ కుడికాల్వ, హంద్రీనీవా, ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకాల నుంచి నీటి విడుదల ఆపాలని కృష్ణానదీ యాజమాన్య బోర్డు ఏపీకి సూచించింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్‌కు బోర్డు సభ్య కార్యదర్శి పరమేశం లేఖ రాశారు. సాగర్ కుడి కాలువ ద్వారా 158.255 టీఎంసీల నీటిని కేటాయించగా ఇప్పటికే 158.264 టీఎంసీల నీటిని వాడుకున్నట్లు బోర్డు తెలిపింది. హంద్రీనీవా, ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకాల ద్వారా 47.173 టీఎంసీల నీటిని కేటాయించగా ఇప్పటివరకు 48.328 టీఎంసీలు వినియోగించినట్లు బోర్డు పేర్కొంది.
ఇప్పటికే కేటాయింపులకు మించి జలాలను తీసుకున్నందున సాగర్ కుడికాలువ, హంద్రీనీవా, ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకాల నుంచి నీటి విడుదల ఆపాలని కృష్ణానదీ యాజమాన్య బోర్డు సూచించింది. నీటి విడుదలకు సంబంధించి బోర్డు ఉత్తర్వులను విధిగా పాటించాలని కోరిన బోర్డు... ఫిర్యాదులకు అవకాశం ఇవ్వవద్దని సూచించింది. ఈ ఏడాది ఇప్పటివరకు రెండు రాష్ట్రాలు వాడుకున్న జలాలు, అందుబాటులో ఉన్న నీటి వివరాలను కృష్ణానదీ యాజమాన్య బోర్డు లేఖలో వివరించింది.
ఇదీ చదవండి: 'తెలంగాణ విభజన చట్టాన్ని అతిక్రమిస్తోంది'