ETV Bharat / city

'ప్రభుత్వం అనుమతిస్తే.. పేదలకు ఉచితంగా ఇళ్ల నిర్మాణం ప్రాజెక్టు చేపడతాం'

ప్రభుత్వం చేపట్టిన పేదలందరికీ ఉచిత ఇళ్లు ప్రాజెక్టును చేపట్టేందుకు తాము సిద్ధంగా ఉన్నామని కొండూరు ఆర్కా గ్రూప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అరుణ్ భవానీ తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రభుత్వం నిర్దేశించిన స్థలంలోనే డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను నిర్మించి ఇస్తామన్నారు. ఇళ్ల నిర్మాణాలు సైతం సొంత పెట్టుబడితో చేపడతామన్నారు. అందుకు బదులుగా పాలి హౌస్సింగ్ ఫార్మింగ్ చేపట్టేందుకు తమకు భూమిని కేటాయించాలని అరుణ్ భవానీ... ప్రభుత్వాన్ని కోరారు.

కొండూరు ఆర్కా గ్రూప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అరుణ్ భవానీ

author img

By

Published : Aug 10, 2020, 4:02 PM IST

ప్రభుత్వంపై ఎలాంటి భారం లేకుండా గృహ నిర్మాణాలతోపాటు... పర్యాటక, క్రీడా ప్రాజెక్టులు చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని కొండూరు ఆర్కా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్, ఆశ్రయం ప్రాజెక్ట్స్ సీఈవో అరుణ్ భవానీ తెలిపారు. తమకు అనుమతిస్తే సమగ్రమైన ప్రణాళికలతో ప్రభుత్వానికి సహకరిస్తామన్నారు. విజయవాడలో మాట్లాడిన అరుణ్ భవానీ... ఆశ్రయం ప్రాజెక్టు కింద ఎన్నో ప్రాంతాలలో అనేక నిర్మాణాలు చేపట్టామని తెలిపారు.

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముప్ఫై లక్షల మందికి ఇళ్లు ఇస్తున్నట్లు ప్రకటించారని... ఆ ప్రాజెక్టుకు తగిన విధంగా ప్రభుత్వం చెప్పిన స్థలంలోనే 400 చదరపు అడుగుల్లో డబుల్ బెడ్ రూం ఫ్లాట్లు ప్లాన్ రూపొందించామన్నారు. ప్రభుత్వం తమకు ఈ ప్రాజెక్టు బాధ్యతలు అప్పగిస్తే ఉచితంగా పేదలకు ఇళ్లు నిర్మించి ఇస్తామన్నారు. పర్యాటక, క్రీడా పరంగా అందరికీ ఉపయోగపడేలా కాంప్లెక్స్ లు అభివృద్ధి చేస్తామన్నారు. ప్రతి కాలనీలో యాభై పడకల ఆసుపత్రిని కూడా నిర్మిస్తామని చెప్పారు. ఈ ప్రాజెక్టులకు సంబంధించి మంత్రులను కలిసి వివరించామన్నారు. ఆధునిక సాంకేతికతో ఈ నిర్మాణాలు చేపడతామన్నారు. ఈ విధంగా కర్ణాటకలో ఐదు లక్షల ఇళ్లు నిర్మిస్తున్నామని వివరించారు.

ఇదీ చదవండి:

పోలవరం ప్రాజెక్టు పూర్తికి అన్ని వనరులను సమీకరించండి: మంత్రి అనిల్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.